- Advertisement -
హాల్దియా(పశ్చిమబెంగాల్): ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో సంభవించిన జలప్రళయంలో బాధితులకు పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా పూర్తిగా సాగుతున్నాయని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం వెల్లడించారు. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో నిరంతరం పరిస్థితిపై చర్చిస్తున్నానని, పరిస్థితిని అదుపులో తీసుకురాడానికి ప్రయత్నిస్తున్నానని, కేంద్ర హోం మంత్రి ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికార బృందాలు ఎప్పటికప్పుడు ఆ రాష్ట్రాన్ని ఆదుకోడానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈరోజు మనం గంగానదీమాతకు చివరన ఒకవైపు ఉన్నాం. కానీ ఉత్తరాఖండ్ రాష్ట్రం గంగానదికి పుట్టిల్లైనా వైపరీత్యాన్ని ఎదుర్కొంటోందని మోడీ పేర్కొన్నారు. వైపరీత్యాన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్ ప్రజలను ప్రశంసిస్తూ యావజ్జాతి వారి క్షేమం కోసం ప్రార్థనలు చేస్తోందని చెప్పారు.
- Advertisement -