Wednesday, December 25, 2024

ట్రైన్ లో ప్రయాణం… బాలికపై ఐదుగురు అత్యాచారం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: పదో తరగతి బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉత్తరాఖండ్‌లోని హల్‌ద్వానీ చెందిన యువతి రైలులో ప్రయాణిస్తుండగా ఐదుగురు నిందితులు ఆమెకు మాయ మాటలు చెప్పి ఢిల్లీలోని హోటల్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై ఐదుగురు అత్యాచారం చేశారు. తన కూతురు కనిపించకపోవడంతో తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఫోన్ లోకేషన్ ఆధారంగా బాలికను గుర్తించారు. బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు బాలిక తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులు ఢిల్లీకి చెందిన అశిష్ అగార్కర్(30), సాహిల్ కుమార్(24), మహారాష్ట్రకు చెందిన పాటిల్(29), సందేశ్ చిప్లాకర్(25), యోగేశ్ నాయక్‌గా(34)గా గుర్తించారు. నిందితులపై  బిఎన్‌ఎస్ 70 సెక్షన్, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News