Wednesday, January 22, 2025

సంబంధం కొనసాగించడంలేదని ప్రియురాలిని చంపిన ప్రియుడు

- Advertisement -
- Advertisement -

రాంఛీ: ప్రియురాలిని ప్రియుడు హత్య చేసిన సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం రాణిపూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్ జిల్లా ధమ్‌పూర్ ప్రాంతంలో పునీత్ అనే వ్యక్తి ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరు కులాలు వేరు కావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో పునీత్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. యువతికి కూడా మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి చేసుకోకుండా తనతో వావాహేతర సంబంధం కొనసాగించాలని పునీత్ యువతిని బలవంతం చేశాడు.

Also Read: తోడేళ్లదే రాజ్యం

దీంతో యువతి ఫోన్ నంబర్ మార్చింది. ఆ ఫోన్‌కు కాల్ చేసి కలుసుకుందామని కబురు పంపాడు. దీంతో యువతిని ఇసుక ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి అనంతరం మృతదేహాన్ని చెట్ల పొదలలో పడేసి వెళ్లిపోయాడు. తిబ్రి ప్రాంతంలో గుర్తు తెలియని యువతి మృతదేహం కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఎవరు అనే విషయం తెలియలేదు. అదే సమయంలో ఎస్‌ఐడిసియుఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన కూతురు కనిపించడంలేదని ఓ తండ్రి ఫిర్యాదు చేశాడు. ఆ మృతదేహం తన కూతురిదే అని చెప్పడంతో విచారణ ప్రారంభించారు. ఫోన్ కాల్ ఆధారంగా పునీత్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News