Wednesday, January 22, 2025

లోయలో బస్సుపడి తల్లీకూతుళ్లు మృతి

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఉదయం ముస్సోరీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న బస్సు లోయలో పడి ముస్సోరీకి చెందిన తల్లీకూతుళ్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్‌తోసహా 38 మందికి గాయాలయ్యాయి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల సాయంతో గాయపడిన వారిలో 26 మందిని డెహ్రాడూన్ లోని డూన్, మాక్స్ ఆస్పత్రులకు చేర్చారు. ఉత్తరాఖండ్ రోడ్‌వేస్‌కు చెందిన ఈ బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

వీరిలో 16 మంది మహిళలు కాగా, 19 మంది పురుషులు. శేర్‌ఘాటీ ఐటిబిపి శిబిరం సమీపంలో బస్సు అదుపు తప్పి సుమారు 70 అడుగుల లోతు లోయలో పడిపోయింది. డ్రైవర్ మితిమీరిన వేగంతో నిర్లక్షంగా బస్సు నడపడమే ప్రమాదానికి దారి తీసిందని ముస్సోరీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఒ డిఎస్ కొహ్లీ చెప్పారు.. లోయలోకి బస్సు దూసుకెళ్లిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్, రెస్కూ , ఐటీబీపీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News