డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రపయాగ్ జిల్లా భద్రీనాథ్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి 11.30 గంటలకు టెంపో లోయలో పడింది. రైతోలి గ్రామ సమీపంలో టెంపో 200 అడుగుల లోతు గల లోయలో నుంచి అలకనందా నది పడడంతో 14 మంది మృతి చెందగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌డిఆర్‌ఎఫ్, రెస్కూ సిబ్బంది అక్కడికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఏడుగురు తీవ్రంగా గాయపడడంతో హెలికాప్టర్‌లో రిషికేశిలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు స్వల్పంగా గాయపడడడంతో రుద్రప్రయాగ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా, మథురా,ఝాన్సీ, ఉత్తరాఖండ్‌లోని హల్దానీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఉత్తర ప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రమాదం జరిగినప్పుడు టెంపోలో 26 మంది ప్రయాణికులు ఉన్నారు.
లోయలో పడిన టెంపో: 14 మంది మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -