Monday, December 23, 2024

ప్రియురాలిని చంపి… మృతదేహాన్ని మూటకట్టి అడవిలో పడేశాడు

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: ప్రియురాలని చంపి అనంతరం మృతదేహాన్ని మూటకట్టి అడవిలో పడేసిన సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం డేహ్రాడూన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముజప్ఫర్‌నగర్‌కు చెందిన రషీద్, షెహనూర్ అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరు కలిసి సంస్కృతి కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. గత కొంత కాలంగా ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఇద్దరు మధ్య ఘర్షణ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆమె గొంతు నులిమి రషీద్ హత్య చేశాడు. మృతదేహాన్ని బ్యాగ్‌లో మూటకట్టి అశరోడి ప్రాంతంలోని అడవిలో పడేశాడు. అనంతరం ప్రియుడు అక్కడి నుంచి పారిపోయాడు. గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణలో భాగంగా రషీద్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. కూతురు కనిపించకపోవడంతో షెహనూర్ తల్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మృతదేహం ఆమె కూతురిదిగా గుర్తించి తల్లికి పోలీసులు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News