Thursday, January 9, 2025

మహిళల దుస్తులు ధరించి విమానాశ్రయ అధికారి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: విమానాశ్రయంలో ఓ అధికారి మహిళల దుస్తులు ధరించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉధమ్‌సింగ్‌నగర్ జిల్లాలో జరిగింది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆశిష్ చౌసాలి అనే వ్యక్తి పంతనగర్ విమానాశ్రయంలో అసిస్టెంట్ మేనేజర్‌గా సేవలందిస్తున్నారు. సోమవారం ఆయన మహిళ దుస్తులు ధరించడంతో పాటు బొట్టు బిళ్ల, లిప్‌స్టిక్ పెట్టుకొని తన గదిలో ఉరేసుకున్నాడు. మిగితా సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణలో ఆత్మహత్యగా భావిస్తున్నామని, గదిలో ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు వెల్లడించారు. మృతుడు స్వస్థలం పితోర్‌గఢ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News