డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమెరికా నుంచి తీసుకొచ్చిన యంత్రం సహాయంతో వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 800 మిల్లిమీటర్ల వ్యాసార్థం కలిగిన స్టీలు పైపులను లోపలికి పంపించారు. 45 మీటర్ల వరకు స్టీలు పైపును పంపించారు. ఇంకా 12 మీటర్ల దూరంలో 41 మంది కూలీలు ఉన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ఒకటి రెండు గంటల్లో పూర్తి అవుతుందని అధికారులు వెల్లడించారు. మరికాసేపట్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఘటనా స్థలానికి చేరుకోనున్నారు. దీపావళి నుంచి ఈ రోజు వరకు ఆపరేషన్ కొనసాగుతోంది. 11 రోజుల క్రితం టన్నెల్‌లో 41 మంది కార్మికులు చిక్కుకపోవడంతో ప్లాన్-ఎ కింద శిథిలాలను తొలగించే ప్రయత్నం చేశారు, కానీ సక్సెస్ కాకపోవడంతో ప్లాన్ బి కింద అమెరికా నుంచి ఎర్త్ ఆగర్ యంత్రాన్ని తీసుకొచ్చి పైపును టన్నెల్ లోకి పంపించారు. 22 మీటర్లు వెళ్లిన తరువాత యంత్రం విరిగిపోవడంతో ఇండోర్ లో నుంచి మరో ఎర్త్ ఆగర్ యంత్రాన్ని తీసుకొచ్చి డ్రిల్లింగ్ ప్రారంభించారు. డ్రిల్లింగ్ పూర్తి చేసిన తరువాత పైపు సహాయంతో కార్మికులను బయటకు తీసుకరావచ్చు. హెలిఫ్యాడ్ వద్ద 41 అంబులెన్స్‌లను ఏర్పాటు చేయడంతో పాటు వైద్య బృందం కూడా అందుబాటులో ఉంది.
11 రోజుల తరువాత సొరంగం నుంచి 41 మంది కార్మికులు బయటకు?
- Advertisement -
- Advertisement -
- Advertisement -