Wednesday, January 22, 2025

సొరంగంలో 40 మంది కార్మికులు సేఫ్

- Advertisement -
- Advertisement -

ఉత్తరకాశి (ఉత్తరాఖండ్ ): ఉత్తరకాశీ జిల్లాలో కూలిన సొరంగం నుంచి 40 మంది కార్మికులను రక్షించడానికి గత మూడు రోజులుగా భారీ ఎత్తున ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచే 900 మిల్లిమీటర్ల వ్యాసం కలిగిన పైపులను డ్రిల్లింగ్ ద్వారా శిధిలాల లోపలికి చొప్పించడానికి, కార్మికులు సొరంగం నుంచి తప్పించుకునేలా ప్రవేశ మార్గం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

కార్మికులు క్షేమంగా ఉన్నారని, గొట్టాల ద్వారా ఆక్సిజన్, నీరు, ఆహారం, ఔషధాలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. లోపల చిక్కుకున్న గబ్బర్ సింగ్ నేగి అనే ఒక కార్మికునితో అతని కొడుకు ఆకాష్ సింగ్ నేగి మాట్లాడడానికి అవకాశం కల్పించారు. కార్మికులు క్షేమంగా బయటకు రాడానికి స్థానిక పూజారి ప్రార్థనలు చేస్తున్నారు. మంగళవారం రాత్రికి లేదా బుధవారానికి కార్మికులను వెలికి తీసుకురాడానికి శ్రమిస్తున్నామని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెక్రటరీ రంజిత్ కుమార్ సిన్హా చెప్పారు. నీటిపారుదల శాఖకు చెందిన ఐదుగురు ఇంజినీర్లతో కూడిన నిపుణుల బృందం అక్కడనే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఐటిబిపి, ఆర్‌ఎఎఫ్, ఆరోగ్యవిభాగంకు చెందిన 160 మంది రిస్కు బృందం ఆదివారం నుంచి సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటోంది. 40 మంది కార్మికులతో ఎప్పటికప్పుడు చర్చించి ధైర్యం చెబుతున్నామని ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కల్నల్ (రిటైర్డ్) సందీప్ సుదేహ్రా తెలియజేశారు. సొరంగం వదులు కాకుండా మట్టి జారిపోకుండా సొరంగాన్ని ఎన్‌హెచ్‌ఐడిసిఎల్ నిర్మిస్తోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రిస్కూ ఆపరేషన్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులకు సూచనలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News