Monday, December 23, 2024

ప్రియుడ్ని పాముకాటుతో చంపిన ప్రియురాలు

- Advertisement -
- Advertisement -

రాంఛీ: బిజినెస్‌మెన్‌ను ప్రియురాలు నాగుపాము కాటుతో చంపిన సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం హల్‌ద్వాని ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బిజినెస్‌మెన్ అంకిత్ చౌహాన్‌కు మహి ఆర్యా అనే ప్రియురాలు ఉంది. అంకిత్‌ను మహి చంపాలని నిర్ణయం తీసుకుంది. మహి తన స్నేహితులు దీప్ కంద్‌పాల్, మరో ఇద్దరి సహాయంతో ప్లాన్ వేసింది. ప్లాన్‌లో భాగంగా పాములు పట్టే వ్యక్తి రమేష్ నాథ్‌ను కలిశారు. మహి ఇంటికి అంకిత్ వెళ్లాడు. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా అంకిత్‌పై రమేష్ పామును విసిరాడు. పాము అంకిత్ కాలుపై రెండు సార్లు కరిచింది. వెంటనే స్పృహ తప్పిపడిపోవడంతో కారులోకి తీసుకెళ్లారు. కారులోనే అంకిత్ మృతి చెందాడు. అంకిత్ సోదరి ఇషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంకిత్ మద్యం తాగిన మైకంలో తనని పలుమార్లు దూషించడంతో చంపానని ప్రియురాలు తెలిపింది. మర్డర్ వెనుక అసలు విషయాలు మాత్రం తెలియడంలేదు.

Also Read: మణిపూర్‌లో దారుణం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News