Monday, December 23, 2024

వంట పని కోసం వచ్చి..

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/వరంగల్ క్రైం: వంట పని కోసం వచ్చి చోరీకి పాల్పడిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దొంగను సిసిఎస్, హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి పోలీసులు రూ.2 లక్షల 50 వేల విలువగల ఒక ఖరీదైన ద్విచక్రవాహనం, ఒక ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్‌కు సంబంధించి సిపి తరుణ్‌జోషి వివరాల ప్రకార.. పోలీస్‌లు అరెస్ట్ చేసిన నిందితుడు షేక్ ఫయాజ్ గాజీపూర్ జిల్లా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడని జీవనోపాధి కోసం హైదరబాద్‌కు వచ్చి నివాసం ఉంటున్నట్లు తెలిపారు. హనుమకొండకు చెందిన హోటల్‌లో వంటమనిషిగా పనిచేయాల్సిందిగా హోటల్ యజమాని నిందితుడికి సూచించడంతో గత అక్టోబర్ 23న హనుమకొండకు చేరుకున్నాడు. హోటల్ యజమాని సూచన మేరకు హనుమకొండ బస్టాండు సమీపంలో యజమాని కిరాయిగదిలో ఉన్నాడు.

అదే గదిలో హోటల్‌లో పనిచేసే మరో ఇద్దరు ఉన్నారు. వీరి వద్ద ఒక ఖరీదైన ద్విచక్రవాహనంతో పాటు ల్యాప్‌టాప్ ఉండడాన్ని నిందితుడు గమనించి అదేరోజు రాత్రి నిందితుడు హోటల్ యజమాని కిరాయి గదిలో మిగతా వ్యక్తులతో కలిసి క్రికెట్ మ్యాచ్ వీక్షించి అనంతరం గదిలో మిగతా ఇద్దరు వ్యక్తులు నిద్రపోవడంతో నిందితుడు సదరు వ్యక్తులకు చెందిన ఖరీదైన ద్విచక్రవాహనంతో పాటు ల్యాప్‌టాప్ చోరి చేసి తప్పించుకొని పారిపోయాడు.

ఈ చోరీపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హనుమకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడి కదలికలను గుర్తించి హనుమకొండ ప్రాంతంలో చోరీ చేసిన ల్యాప్‌టాప్‌ను అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు పాల్పడిన నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైమ్ అండ్ ఆపరేషన్స్ అదనపు డిసిపి పుష్పారెడ్డి, క్రైమ్స్ ఎసిపి డేవిడ్‌రాజు, సిసిఎస్ ఎన్స్‌పెక్టర్లు రమేష్‌కుమార్, శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్, సిబ్బందిని సిపి ఈసందర్భంగా అభినందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News