Wednesday, January 22, 2025

‘చార్టర్ల’ అడ్డా బేగంపేట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో ప్రైవేట్ విమానాల జోరు

మన తెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏమాత్రం తీసిపోకుండా బేగంపేట విమానాశ్రయం విమానాల రద్దీతో సందడిగా మారింది. ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రైవేటు విమానాల (చార్టర్) రాకపోకలు అధికంగా జరుగుతున్నాయని ఏవియేషన్ అధికారులు గణాంకాలను బట్టి తెలుస్తోంది. రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారు, వివిధ కంపెనీల ఎండిలు, డైరెక్టర్‌లు చాపర్‌లను అధికంగా వినియోగిస్తుండడంతో బేగంపేట విమానాశ్రయం సందడిగా మారింది. ప్రస్తు తం బేగంపేట విమానాశ్రయంలో ఎప్పుడూ 22 ప్రైవేటు విమానాలు (చార్టర్) అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయంలో 22 పెద్ద, చిన్న విమానాలకు మాత్రమే పార్కింగ్ చేసే సదుపాయం ఉంది.

ప్రస్తుతం 24 గంటల పాటు ఇక్కడ విమానాలు అందుబాటులో ఉన్నాయి. ఖర్చు అధికమైన సమయం వృధా కావొద్దన్న ఆలోచనతో ప్రముఖులంతా ఈ చాపర్‌లపై ఆధారపడుతున్నారు. నుంచి 8 లక్షల వరకు చాపర్‌ల అద్దెను చె ల్లించడానికి వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందిన వారు వెనుకాడడం లేదంటే చార్టర్ల వినియోగం ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ప్ర స్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు పథకాలు, టిఎస్‌బిపాస్, టిఎస్ ఐపాస్‌లతో పాటు 24 గంటల పాటు కరెంట్ సరఫరా, పెట్టుబడులు పెట్టే వారికి పలు ప్రోత్సాహాకాలు, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టడం లాంటి వాటితో పాటు రాష్ట్రానికి వరదల్లా పెట్టుబడులు వస్తున్నాయి. దీంతోపాటు హైదరాబాద్ హెల్త్‌హబ్‌కు వేదికగా మారడం కూడా రాష్ట్రానికి కలిసివచ్చే అంశం కావడంతో చార్టర్‌లు, ఎయిర్ అంబులెన్స్‌ల వినియోగం అధికంగా మారిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

నెలకు 30 నుంచి 40 ఎయిర్ అంబులెన్స్‌లు

ప్రస్తుతం వివిధ రాష్ట్రాల నుంచి రోగులు సైతం నగరంలో పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవడానికి వస్తున్నారు. వారిని తీసుకురావడానికి నెలకు 30 నుంచి 40 ఎయిర్ అంబులెన్స్‌లు బేగంపేట విమానాశ్రయానికి వచ్చి వెళుతున్నాయి. మాములుగా బేగంపేట విమానాశ్ర యంలో విమానాన్ని పార్కింగ్ చేస్తే రోజుకు రూ.8 వేలను చార్జీల రూపంలో ఏవియేషన్ అధికారులు వసూలు చేస్తున్నారు. గతంలో బేగంపేట నుంచి హెలీక్యాప్టర్‌లను ఎక్కువగా వినియోగించేవారు హెలీక్యాప్టర్‌ల స్థానంలో చిన్న విమానాల వినియోగం అధికంగా పెరిగిందని ఏవియేషన్ అధికారులు పేర్కొంటున్నారు. దీంతోపాటు హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు రావడంతో అక్కడి నుంచి రోగులు హైదరాబాద్ రావడానికి ఎయిర్ అంబులెన్స్‌లను సైతం అధికంగా వినియోగించడంతో బేగంపేట విమానాశ్రయంలో రద్దీ నెలకొంటుంది. ఇక్కడి నుంచి చార్టర్ విమానాలు వినియోగించే వారు ఢిల్లీ, బెంగళూరు, తిరుపతి, షిర్టీ, విశాఖపట్నం, విజయవాడ, ముంబై, చెన్నై, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళుతున్నారు. పెద్ద కంపెనీలకు చెందిన డైరెక్టర్‌లు ఎండిలు సైతం తాము తెచ్చుకున్న చాపర్‌లను బేగంపేట విమానాశ్రయంలో పార్కింగ్ చేసి సాయంత్రానికి తిరిగి వెళ్లిపోవడం గమన్హారం.

హుస్సేన్‌సాగర్ టు నాగార్జునసాగర్…

దీంతోపాటు పర్యాటకరంగాన్ని ప్రోత్సహించే ఉద్ధేశ్యంతో సీ ప్లేన్‌ను హుస్సేన్‌సాగర్, నాగార్జునసాగర్‌ల వద్ద మొదటగా అందుబాటులోకి తీసుకురావాలని ఏవియేషన్ అధికారులు నిర్ణయించారు. దీనివల్ల అధికంగా పర్యాటకులకు మేలు జరగడంతో పాటు వారికి సమయం కూడా కలిసిరానుంది. సీ ప్లేన్‌కు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సైతం అనుమతులు ఇచ్చినట్టుగా ఏవియేషన్ అధికారులు పేర్కొంటున్నారు. వీటితోపాటు రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలకు ముందస్తుగా చిన్న విమానాలను అందుబాటులోకి తీసుకురావాలని అందులో భాగంగా విమానాశ్రయాలను నిర్మించాలని రాష్ట్రం నిర్ణయించిన నేపథ్యంలో ఆరు విమానాశ్రయాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో ప్రస్తుతం నిజామాబాద్, వరంగల్ విమానాశ్రయాలకు సంబంధించి పనులను పూర్తి చేయడానికి ఏవియేషన్ అధికారులు తమవంతు కృషి చేస్తున్నారు. ఈ రెండు జిల్లాలో విమానాశ్రయాలకు సంబంధించి భూ సేకరణతో పాటు వివిధ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్‌లను మంత్రి కెటిఆర్ గతంలో ఆదేశించడంతో ఆయా జిల్లాల అధికారులు ఏవియేషన్ అధికారులకు సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు జిల్లాలో భూ సేకరణ దాదాపు పూర్తి కావొచ్చిందని, మూడునెలల్లో టెర్మినల్ బిల్డింగ్‌లను పూర్తి చేస్తామని ఏవియేషన్ అధికారులు పేర్కొంటున్నారు.

800ల మందికి శిక్షణ ఇచ్చేలా సెంటర్ నిర్మాణం
విఎన్ భరత్‌రెడ్డి, ఏవియేషన్ డైరెక్టర్, తెలంగాణ

పైలట్, కో పైలట్‌లకు శిక్షణ ఇవ్వడానికి బేగంపేటలో ట్రైనింగ్ సెంటర్‌ను నిర్మిస్తున్నాం. త్వరలోనే ఇది పూర్తవుతుంది. ఇందులో 500ల నుంచి 800ల మందికి శిక్షణ ఇవ్వొచ్చు. అన్ని సౌకర్యాలను ఇక్కడ కల్పిస్తున్నాం. రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారు, వివిధ కంపెనీలకు చెందిన ప్రముఖ వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయాణాల కోసం బేగంపేట విమానాశ్రయాన్ని అధికంగా వినియోగించుకుంటున్నారు. 22 విమానాలను పార్కింగ్ చేసేలా ఇక్కడ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. గతంకన్నా ప్రస్తుతం ప్రైవేటు చాపర్‌ల వినియోగం అధికంగా పెరిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News