Sunday, December 22, 2024

నరేంద్ర మోడి బిసిలకు చేసిందేమిలేదు : విహెచ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిసి సామాజిక వర్గానికి చెందిన నరేంద్ర మోడి ప్రధాని అయినా బిసిలకు చేసిందేమి లేదని పిసిసి మాజీ అధ్యక్షులు వి. హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ పేదలకు ఇచ్చిన భూములను బిఆర్‌ఎస్ ప్రభుత్వం లాక్కుంటుందని ఆరోపించారు. బిసి జనగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో విఆర్‌ఓ వ్యవస్థను రద్దు చేసి తాసీల్ధార్ ల కు పని లేకుండా చేశారని విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో బిసిలకు ప్రాధాన్యత ఇస్తామని రాహుల్ గాంధీ హామీనిచ్చారన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బిసిలకు మూడు అసెంబ్లి సీట్లైనా కేటాయించాలన్నారు. రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతి జిల్లాకు తీసుకువెళ్తామని చెప్పారు. ధరణి పోర్టల్ ద్వారా రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శించారు. త్వరలో బిసి గర్జన సభ నిర్వహిస్తామని హనుమంతరావు చెప్పారు. కాంగ్రెస్ బిసి గర్జన సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్యను ఆహ్వానిస్తామన్నారు. తెలంగాణలో బిజెపి పని ఖతం అయిందన్నారు. తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని చెప్పారు. బిసిల్లో చైతన్యం వచ్చిందని బిసిలకు టిక్కెట్లు కావాలని ఎవరు అడిగినా స్వాగతిస్తామని విహెచ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News