- Advertisement -
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని అన్నందుకు మల్లు భట్టి విక్రమార్క తనపై పగబట్టిండని కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హన్మంతరావు ఆరోపించారు. మల్లు రవికి తాను టికెట్ ఇప్పిస్తే భట్టి విక్రమార్క తన కాళ్లు మొక్కిండని గుర్తుచేశారు. భట్టి విక్రమార్కను తానే రాజకీయాల్లోకి తీసుకొచ్చానని తెలిపారు. కానీ ఇప్పుడు భట్టి విక్రమార్కకు ఆ కృతజ్ఞత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం టికెట్ తనకు రాకుండా కుట్ర చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఆరోపించారు. అటు తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన నివాసంలో హన్మంతరావు మౌన దీక్షకు దిగారు.
- Advertisement -