Sunday, December 22, 2024

కెటిఆర్ మాట్లాడిన తీరు బాలేదు

- Advertisement -
- Advertisement -

పది రోజులు కూడా ఓపిక పెట్టకపోతే ఎలా ?
మాజీ ఎంపి వి.హనుమంతరావు

హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్ మాట్లాడిన తీరు బాగాలేదని మాజీ ఎంపి వి.హనుమంతరావు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి దావోస్ పోవడం తెలంగాణ కోసమే వెళ్లారని తెలిపారు. గాంధీభవన్‌లో విహెచ్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మమ్మల్ని అనేక రకాలుగా తిట్టిన వాళ్లను మీ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ఒక్క పని చేయలేదన్నారు.

పదేళ్లు మీరు రాష్ట్రాన్ని పాలించారు. పది రోజులు కూడా ఓపిక పెట్టకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామన్నారు. ధరణి కమిటీ వేశామని, అనేక పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. తొందరపడి పడి మాట్లాడితే మీరు ఇంకా నష్టపోతారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ఆలోచన చేసి మాట్లాడాలన్నారు.

మీ ప్రకటన వల్ల మీరే ఇంకా దిగజరిపోతారని విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం దావోస్ వెళ్లిన సిఎంపై కామెంట్లు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలకంటే ముందే మీ లొల్లి ఏంది? అని విహెచ్ ప్రశ్నించారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ గల్లంతు అవుతుందని ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News