Saturday, November 2, 2024

జేసీ దివాకర్‌రెడ్డి తన రాజకీయాలేవో ఆంధ్రాలో చేసుకోవాలి: విహెచ్

- Advertisement -
- Advertisement -

v hanumantha rao comments on JC Divakar Reddy

హైదరాబాద్: గత రెండ్రోజులుగా ఎపి టిడిపి నేత, మాజీ ఎంపి జేసీ దివాకర్‌రెడ్డి హైదరాబాద్‌లో సందడి చేస్తున్నారు. తెలంగాణ సిఎల్పీ కార్యాలయానికి విచ్చేసిన ఆయన ఒకప్పటి తన కాంగ్రెస్ సహచరులను కలుస్తూ అన్ని అంశాలపైనా తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. జెసీ దివాకర్‌రెడ్డి తన రాజకీయాలేవో ఆంధ్రాలో చేసుకోవాలని హితవు పలికారు. సీఎల్పీలో అడుగుపెట్టి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమేంటి? అని విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నాగార్జునసాగర్‌లో జానారెడ్డి ఓటమి ఖాయం అని చెప్పడానికి జేసీ ఎవడని విహెచ్ మండిపడ్డారు. అంత గొప్ప నాయకుడైతే జేసీ తన రాజకీయ బలాన్ని అనంతపురంలోనో.. రాయలసీమలోనో చూపించుకోవాలని, చేతనైతే జగన్‌పై పోరాడాలని విహెచ్ పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే కార్యకర్తలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News