Wednesday, January 22, 2025

ప్రధాని మోడీకి భయం పట్టుకుంది:వి. హనుమంతరావు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తుందన్న భయం ప్రధాని మోడీకి పట్టుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండియా కూటమి వస్తే సంవత్సరానికి ఒకరు ప్రధాని అవుతారని ప్రధాని మోడీ చెబుతున్నారని, ఇండియా కూటమికి మూడెంకల సీట్లే రావంటున్న మోడీ మరి సంవత్సరానికి ఒక ప్రధాని ఎలా అవుతారని అంటున్నారని విహెచ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ కులగణన చేస్తామని చెప్పడంతో బిజెపి దిగజారి మాట్లాడుతుందని విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోడీ పదేళ్ల పాలనలో అయోధ్య రామమందిరం కట్టడం తప్ప దేశాన్ని పారిశ్రామిక, వ్యవసాయ, వైజ్ఞానిక రంగాల్లో, ఆర్ధిక రంగంలో కొత్తగా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. రిజర్వేషన్లను, రాజ్యాంగాన్ని తీసేస్తామన్నట్లుగా బిజెపి నేతలు మాట్లాడుతున్నారని విహెచ్ విమర్శించారు. మోడీ ఆలోచన అంత కార్పొరేట్ స్థాయే అని విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ వస్తే ముస్లింలకు రిజర్వేషన్ తీసేస్తానడంలో సందేహం లేదన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఎస్సీ, ఎస్టీ, బిసిలకు సామాజిక న్యాయం దక్కుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News