Monday, January 20, 2025

శశిథరూర్ చెబుతున్నది బ్రిటన్ సంస్కృతి: విహెచ్

- Advertisement -
- Advertisement -

VH demands jagan to put sanjeevaiah name to kurnool

 

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామ్యం లేదని బిజెపి విమర్శలు  చేయడం సరికాదని వి హనుమంత రావు తెలిపారు. దేశం కోసం దివంగత ప్రధానులు రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ప్రాణాలర్పించారని, సోనియా గాంధీకి ప్రధానమంత్రి పదవి వచ్చిన తీసుకోలేదన్నారు. ఎఐసిసి ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీలో ఉన్నారని, మల్లికార్జున్ ఖర్గే కు గ్రౌండ్ రియాల్టీ తెలుసునని శిథరూర్ ఏమీ తెలియదని విమర్శించారు. మల్లికార్జున్ ఖర్గే డిబేట్స్ కు రావాలని శశిథరూర్ అనడం సరికాదని సూచించారు. శశిథరూర్ చెబుతున్నది బ్రిటన్ సంస్కృతిలాగా ఉందని,  బ్రిటన్ సంస్కృతి ఇక్కడకి తీసుకురావాలని శశిథరూర్ చూస్తున్నారా? అని విహెచ్ ప్రశ్నించారు. శశిథరూర్ మాకు చెప్పి నామినేషన్ వేయలేదన్నారు. ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పాదయాత్ర మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News