హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంత్ రావు, ఏఐసిసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్, ఎంపి ఉత్తమ్ కుమా ర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం అంబర్‌పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో ఉత్తమ్‌పై విహెచ్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనను కాంగ్రెస్ నుంచి బయటకు పంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించా రు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అంబర్ పేట్ నియోజకవ ర్గం వెంట పడుతున్నారని, అంబర్‌పేట్ సీటు తనదని ఇక్కడ వేలు పెడి తే బాగొదని వి హెచ్ హెచ్చరించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అంబర్ పేట్ వెంట పడితే తా ను ఆయన వెంట పడుతానని విహెచ్ వార్నింగ్ ఇచ్చా రు. గతంలో అం బర్‌పేట్ నుంచి గెలిచి తాను మంత్రి అయ్యాయని విహెచ్ గుర్తు చేశా రు. గతంలో తనపై కేసులు పెట్టిన నూతి శ్రీకాంత్ గౌడ్‌కు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అంబర్ పేట్ సీటు ఇప్పించాలని ప్రయత్నిస్తున్నారని అలాం టి వ్యక్తిని ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదని విహెచ్ ఆ గ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తమ్‌కు, ఆయన భార్యకు మాత్రం సీట్లు కావాలని, నాకు మాత్రం సీటు వద్దా అంటూ విహెచ్ నిలదీశారు. డబ్బులు తీసుకొని పోటీలో వెనక్కి తగ్గుతున్నానని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విహెచ్ సీరియస్ అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో తన మనుషులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డిని బయటకు పంపించారని ఇప్పుడు జగ్గారెడ్డి పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని విహెచ్ సంచలన ఆరోపణలు చేశారు. గతం లో రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా జగ్గారెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్‌కుమార్ రెడ్డేనని విహెచ్ ఆరోపించారు. తాను ఎన్నటికీ పార్టీ మారనని, గాంధీ కుటుంబానికి విధేయుడినని విహెచ్ స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా పనిచేయడం ఆపకపోతే ఉత్తమ్ పార్టీకి వ్యతిరేకంగా చేసిన పనులను బయ ట పెడతానంటూ విహెచ్ వార్నింగ్ ఇచ్చారు. కాగా, పార్టీ కీలక నేత అ యిన ఉత్తమ్‌పై సీనియర్ నేత విహెచ్ చేసిన వ్యాఖ్య లు ప్రస్తుతం కాం గ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. బిసిలకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు ఇస్తదో చెప్పాలని విహెచ్ డిమాండ్ చేశారు. బిసిలను ఓట్లేసే యంత్రాలుగా భావించొద్దని ఆయన హెచ్చరించారు.