Monday, December 23, 2024

బిసిలకు న్యాయం జరగాలంటే.. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిసిలకు న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజార్టీ అభ్యర్థులను పార్లమెంట్‌కు పంపాలని ఆయన రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన చేసి అన్ని కులాలకు న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, అందుకే ప్రజలంతా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు.

ముఖ్యంగా బిసిలకు న్యాయం జరగాలంటే కులగణన చేయాల్సిందేనని ఆయన నొక్కి చెప్పారు. రాహుల్ గాంధీ కులగణన చేస్తామన్న హామీ తప్పకుండా అమలు చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సకల ప్రజలు సంపూర్ణమైన ఆనందంతో జీవించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన వివరించారు. మాట నిలబెట్టుకునే తత్వం ఇందిరమ్మ కుటుంబంలో ఉందని, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పి అధికారంలోకి రాగానే అమలు ప్రక్రియ మొదలు పెట్టామని వి.హనుమంతరావు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News