Monday, January 20, 2025

వారిద్దరు బిసి కులగణనకు హామీ ఇచ్చారుః విహెచ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇద్దరు నాయకులు బిసి కులగణన చేస్తామని హామీ ఇచ్చారని సినియర్ నాయకుడు వి హనుమంతరావు చెప్పారు. శనివారం గాంధీ భవన్ లో హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులగణనపై రెండు సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినా ప్రయోజనం లేదని అన్నారు.

సెప్టెంబర్ 6 తర్వాత బిసి గర్జన సభ పెట్టాలని భావిస్తున్నామని, ఈ కార్యాక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తామని చెప్పారు. కనీసం రెండు లక్షల మందితో ఈ సభ పెడతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తనకు, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News