హైదరాబాద్: సైనికుల నియమకాలలో అగ్నిపథ్ పేరుతో 4 ఏళ్ళు సర్వీస్ పెట్టడం దారుణమని మాజీ పీసీసీ అధ్యక్షులు, వి.హనుమంతరావు అన్నారు. ఆయన శుక్రవారం గాంధీభవన్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్ల తర్వాత అభ్యర్థుల జీవితాలకు భరోసా ఇవ్వడం లేదన్నారు. గతంలో 15 నుంచి 20 సంవత్సరాలు సర్వీస్ తోపాటు అన్ని సౌకర్యాలు ఇచ్చేవారు. సైనికులకు పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుందని ఇలా చేయడం దారుణమన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడ్డ వారికి బిజెపి ఇచ్చే గౌరవం ఇదేనా కేంద్రానికి ప్రశ్నించారు. డిఫెన్స్ దగ్గర నిధులు లేవంటే ప్రపంచం ముందు దేశం పరువు ఏమి కావాలని విహెచ్ అన్నారు. ఇలాంటి సంఘటనలు బిజెపి మానుకోవాలని సూచించారు. నేడు దేశంలో అగ్నిపథ్ అగ్ని గుండంలా మారిందన్నారు. మహమ్మద్ ప్రవక్త పైన బిజెపి నాయకులు చేసిన ప్రకటనలతో ప్రపంచం ముందు భారత్ పరువు పోయిందన్న ఆయన ఇవన్నీ దేశ ప్రతిష్టను మంట గలుపుతున్నాయని పేర్కొన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన ప్రధాని మోడీకి పాలించే నైతిక హక్కు లేదని వి.హెచ్ స్పష్టం చేశారు.
అగ్నిపథ్ అగ్నిగుండంగా మారింది: విహెచ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -