Monday, December 23, 2024

బిజెపికి ఓడిపోతామన్న భయం పట్టుకుంది: హనుమంతరావు

- Advertisement -
- Advertisement -

బిజెపికి ఓడిపోతామన్న భయం పట్టుకుంది
పాఠ్య పుస్తకాల్లో ఇండియా పేరు తీసేసి భారత్ పెట్టడం తప్పు
కేంద్ర నిర్ణయాన్ని ఖండిస్తున్నా
తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎలక్షన్ కమిషన్‌ను చూడలేదు
కర్ణాటక సిఎం సిద్ధరామయ్య త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తారు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి వి.హనుమంతరావు
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలో అధికారం పోతుందన్న భయం బిజెపికి పట్టుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి వి. హనుమంతరావు అన్నారు. గురువారం గాంధీభవన్‌లో విహెచ్ మీడియాతో మాట్లాడుతూ ఓడిపోతామన్న భయంతోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాఠ్య పుస్తకాల్లో ఇండియా పేరు తీసేసి భారత్ అని పెడుతున్నారన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

ప్రపంచంలో పేరున్న దేశం ఇండియా అని, ఎన్నికల కోడ్ పేరుతో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి సామాన్య మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఇలాంటి ఎన్నికలను తాను ఎప్పుడూ చూడలేదన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎలక్షన్ కమిషన్‌ను చూడలేదన్నారు. కర్ణాటక సిఎం సిద్ధరామయ్య త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తారని, సిద్ధరామయ్య బిసి డిక్లరేషన్ ప్రకటిస్తారని వి. హనుమంతరావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News