Wednesday, January 22, 2025

కాంగ్రెస్ సభలు పెట్టుకుంటే బిజెపికి ఎందుకంత భయం: విహెచ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ సభలు పెట్టుకుంటే బీజేపీకి ఎందుకు అంత భయం అని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు(విహెచ్) ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ నేతలను కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష్య సాధింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఛత్తీస్ గఢ్‌లో ఎఐసిసి ప్లీనరీ సమావేశాలు పెట్టుకుంటోందనే అక్కసుతోనే ఆ రాష్ట్ర సీఎం భూపేష్ భాగేల్ సోదరుడికి ఇడి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.

ప్రతిపక్షాలు లేకుండా చేయాలని బిజెపి చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ నేతలకు ఇడి నోటీసుల వెనుక అమిత్ షా ఉన్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి మద్దతుగా మార్చి 22 నుంచి 25 వరకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో కుక్కల దాడులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల దాడిలో మరణించిన బాలుడి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వీధి కుక్కలను నియంత్రించకపోతే చిన్న పిల్లలపై మరిన్నీ దాడులు పెరుగుతాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News