Wednesday, January 22, 2025

పోరాడి సాధించుకున్న తెలంగాణపై బొత్సా ఇంకా విషం కక్కుతున్నారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎన్నో ఏండ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా విషం కక్కుతున్నారని , తెలంగాణ విద్యా వ్యవస్థను, విద్యార్థులను తీవ్రంగా అవమానించారని పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. గురువారం సెక్రటేరియట్ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ ఎపి మంత్రి బొత్స సత్యనారాయణ తన చిన్నతనంలో పరీక్షలు చూసి రాసారు కాబట్టి అలాంటి కామెంట్స్‌ను ఇప్పుడు చేశారని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక అక్కసుతో ఇలా ఆరోపణలు చేస్తున్నారన్నారు. అబద్దాలు ఆడే అంధ్రప్రదేశ్ నాయకులు.. మీ మూతి మీరే కడుక్కోండనీ సూచించారు.

ఓక్స్ వ్యాగన్ లాంటి కుంభకోణాలు గతంలో జరిగాయని, అవే స్కామ్‌లు ఇప్పటికీ జరుగుతున్నాయని బొత్స సత్యనారాయణ అనుకుంటున్నరేమో? నని ప్రశ్నించారు. చిల్లర మల్లర వ్యాఖ్యలతో బొత్స తెలంగాణ విద్యా వ్యవస్థను, విద్యార్థులను ఘోరంగా అవమానించారనీ ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి పై బొత్స సత్యనారాయణ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నంచారు. తను హైదరాబాద్‌కు వచ్చినప్పుడైనా? లేదా టీవీ డిబేట్లలోనైనా వస్తారా? అని ప్రశ్నించారు.

‘ఎపిలో కులాల పిచ్చి, ప్రజలను రెచ్చగొట్టే రాజకీయం ఉందని తాము ఎప్పుడైనా అన్నమా?’ అని పేర్కొన్నారు. “నన్ను రమ్మంటే వస్తా…నేను విజయవాడ కనకదుర్గమ్మ, తిరుపతిలో ఎక్కడైనా చర్చకు రెడీ.. ఏ అంశం అయినా సరే.. అని శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు . ఎపి రాజధాని ఏదని పోటీ పరీక్షల్లో ని అడిగితే సమాధానం రాయలేని పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణ విద్యార్థులతో …ఎపి విద్యార్థులను తీసుకొచ్చి పోటీ పరీక్షలు పెడితే టాలెంట్ బయటపడుతుందన్నారు. ఎపిపిఎస్‌సిలో ఆనాడు స్కామ్స్ చేసిన చరిత్ర వాళ్ళదని…డబ్బుల కట్టలతో లాడ్జ్ లన్ని నిండేవనీ శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి ఎపి మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తులే కారణమన్నారు. రెండు ప్రాంతాల ప్రజలను సమానంగా చూస్తే పరిస్థితి భిన్నంగా ఉండేదన్నారు . పవిత్ర తిరుమల దర్శనాల్లోనూ వైసిపి ప్రభుత్వం వివక్ష చూపిస్తూ భక్తులను ఇబ్బంది పెడుతోందని, తెలంగాణ మంత్రులు, విఐపి అధికారుల లేఖలకు విలువ ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News