Monday, December 23, 2024

వార ఫలాలు 22-10-2023 నుండి 28-10-2023 వరకు

- Advertisement -
- Advertisement -

మేషం: మేష రాశి వారికి ఈ వారం మీరు పెద్దవారిపై చూపించే శ్రద్ధభక్తుల వలన, స్నేహవర్గం నుండి అనుకూలమైన ఫలితములు, సలహాలు సానుకూలత ఉంటుంది. శత్రువర్గం నుండి కూడా ఆదరాభిమానములు పొందగలరు. ఉద్యోగస్తులకు సామాన్యంగా, యథావిధిగా కొనసాగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.నూతన వస్తువులు కొనుగోళ్లు చేస్తారు.శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు కొంత ఆర్థిక లాభములు తక్కువగా ఉండే అవకాశములు ఉన్నాయి. వివాహ ప్రయత్నములు చేసే వారికి ఈవారం అనుకూలమైన ఫలితాలుంటాయి. ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన.

వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం సర్వత్రా శుభఫలితములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు వంటివి కానీ, అభివృద్ధి వంటివి అనుకూలమైన ఫలితములను ఇస్తాయి. వ్యవసాయ రంగం, కళారంగం వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు.సాఫ్ట్‌వేర్, టెక్నికల్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలుంటాయి.అనుకున్న అభివృద్ధి ఉంటుంది. రియల్‌ఎస్టేట్ రంగం వారికి స్థిరాస్తి వృద్ధి అయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. వ్యాపారములు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నములు చేయు వారికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. కార్యానుకూలత ఏర్పడుతుంది. ఈ రాశివారు ఇష్ట దైవారాధన చేయడం శ్రేయసకరం.

మిథునం: మిథున రాశి వారికి ఈ వారం ఉద్యోగపరంగా సామాన్యంగా నడిచే అవకాశములు ఉన్నాయి. పెండింగ్ పనులు ఉంటే వాటి గురించి ఆలోచించకండి. నిదానంగా కుదుటపడుతాయి. ఉద్యోగంలో కానీ, పని చేసే చోట కానీ శత్రువర్గం నుండి మీ మీద లేనిపోని నిందలు వేసే అవకాశములు ఉన్నాయి. ఆచితూచి అడుగులు వేయండి. వ్యాపారస్తులకు పలుకుబడి పెరిగి గౌరవం వృద్ధి అయ్యే అవకాశములు ఉన్నాయి. అయితే వ్యాపారస్తులకు పలుకుబడి వలన మంచి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. సంతానం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. వివాహ ప్రయత్నములు చేసే వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఈ రాశి వారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

కర్కాటకం: ఈ వారం కర్కాటక రాశి వారికి ఆర్ధికపరమైన లాభములు, చిన్నపాటి బహుమానములు వంటివి పొందే అవకాశములు గోచరిసున్నాయి. కుటుంబ పరముగా సౌఖ్యం, వృద్ధి ఉంటుంది. సాఫ్ట్‌వేర్ రంగం వారికి అనుకూలమైన ఫలితములుంటాయి. వ్యాపారస్తులకు ముఖ్యంగా తెలివి ఎక్కువ పెట్టుబడి పెట్టే కన్సెల్టెన్సీలు వంటివారికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు.ఉద్యోగస్తులకు మాత్రం కొత్త అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. బయట జరిగే చికాకులకు ఇంట్లో కుటుంబం పట్ల శ్రద్ధ చూపించడం మంచిది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోండి. గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన.

సింహం: సింహరాశి వారికి ఈ వారం ఉద్యోగపరంగా బాగుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసేవారికి అనుకూలం అని చెప్పవచ్చు.ఉద్యోగస్తులకు వారు పని చేసే చోట శత్రువర్గం ఉన్నప్పటికీ వారిని అధిగమించి అభివృద్ధి అందుకుంటారు. వ్యాపారస్తులకు కూడా మంచి పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు పేరుతో పాటు ఆర్ధికపరంగా కూడా లాభములు ఉంటాయి. అనుకున్న వ్యవహారములు చక్కబెడతారు.కుటుంబం లో జీవిత భాగస్వామి పట్ల, స్నేహవర్గంలో సంతోషంగా ఉన్నప్పటికీ బంధు వర్గంలో కొంత ఈర్ష్య అసూయలు వచ్చే అవకాశములు ఉన్నాయి. అలాగే వివాహం కానీ వారికి వివాహ ప్రయత్నములు చేయడానికి అనుకూలమైన సమయం. నూతన వస్తు, వాహనములు కొనుగోలుకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు.

కన్య: ఈ వారం కన్య రాశి వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ అనుకున్న పనులు పూర్తవుతాయనుకునే సరికి నమ్మిన వారి వలన మోసాలు జరగడం, అనుకున్న పనులు వాయిదాలు పడడం వంటివి ఉండే అవకాశములు ఉన్నాయి. కాబట్టి మీ సామర్ధ్యంతో ముందుకు సాగండి, ఎవరిని నమ్మి రహస్యాలు, పనియందు మెళకువలు చెప్పడం మంచిది కాదు. మాట విషయంలో జాగ్రత్త వహించండి. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసేవారికి తాత్కాలికంగా వచ్చినట్టే వున్నప్పటికీ పూర్తి సంతృప్తి ఉండకపోవచ్చు. పట్టుదలతో అడుగు ముందుకు వేయండి. ఈ రాశి వారు కుబేర కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన.

తుల: తులా రాశి వారికి ఈ వారం కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి. స్నేహవర్గంలో కూడా మంచి సాయం అందుతుంది. అయితే ఉద్యోగంలో అనుకున్న అభివృద్ధిలో ప్రతికూలమైన ఫలితాలుండే అవకాశములు ఉన్నాయి. ఇంతకాలం నుండి పని చేస్తే ఇదేనా ప్రతిఫలం అనే భావన వస్తుంది. వ్యాపారంలో కూడా అనుకున్న పనులకు ఆటంకములు, ఇబ్బందులు ఉండే అవకాశములు ఉన్నాయి. సొంత వారి వలన నష్టములు వచ్చే అవకాశములు ఉన్నాయి. ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయములు తీసుకోండి. ప్రతి నిత్యం జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు.

వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈవారం ప్రతికూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. అన్ని విధముల మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పని చేసే చోట కార్యాలయములలో శత్రువర్గం నుండి ఇబ్బందులు, పైఅధికారులతో పని ఒత్తిడి ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు లాభాలు కంటే ఖర్చులు అధికం అయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. అన్ని విధముల వ్యయ ప్రయాసలు ఎక్కువ అయ్యే సూచనలు ఉన్నాయి. విద్యార్థినీ, విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది. యువత వ్యక్తిత్వం విషయంలో ఆత్మస్థైర్యంతో ఉండండి. 8 శని వారాలు శనికి తైలాభిషేకం చేయడం మంచిది అని చెప్పదగిన సూచన.

ధనస్సు: ఈ వారం ధనుస్సు రాశి వారికి ఈ వారం సర్వత్రా విజయములు వరిస్తాయని చెప్పవచ్చు. సాఫ్ట్‌వేర్ రంగం వారికి, టెక్నికల్ రంగం వారికి కూడా ఉద్యోగ పరంగా అనుకూలత ఉంటుంది. ప్రమోషన్లు, బదిలీలు వంటి వాటికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు అనుకున్న అభివృద్ధి, ఎదుగుదల కనబడుతుంది. రియల్ ఎస్టేట్ వారికి స్థిరాస్తి వృద్ధి అవుతుంది, అమ్మకములు కంటే కొనుగోలు విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. సంతానం కోరుకునే వారికి శుభ వార్తలు వినే అవకాశములు ఉన్నాయి. సంతానపరంగా వారి అభివృద్ధికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. కుటుంబపరంగా సంతృప్తి, సంతోషకరమైన సమయం గడుపుతారు. ఈ రాశి వారు శివాలయంలో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన.

మకరం: మకరరాశి వారికి ఈ వారం పూర్తిగా అనుకూలంగా లేకపోయినప్పటికీ గతంలో కంటే కొంత సానుకూలత ఏర్పడుతుంది. మీ ఉద్యోగాభివృద్ది ఒకేసారి కాకుండా క్రమక్రమాభివృద్ధి అవుతుంది. ఉద్యోగ విషయంలో అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఉంటుంది. అందరితో సన్నిహితం పెరుగుతుంది. శత్రువర్గం ఏదైనా ఉంటే కొంత ఇబ్బందులు తొలగిపోయి మిత్రులుగా మారే అవకాశములు ఉన్నాయి. మీ మంచితనం, ఓర్పు దీనికి కారణమని చెప్పవచ్చు. మనోవాంఛ సిద్ధిస్తుంది. కుటుంబపరంగా సంతోషం లభిస్తుంది. ఏలినాటి శని నడుస్తున్నందున 8 శని వారలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన.

కుంభం: కుంభరాశి వారికి ఈవారం కూడా జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు పైఅధికారులతో మాటపట్టింపులు ఉండే అవకాశములు ఉన్నాయి, ఆ కారణంగా ఒత్తిడికి, వేదనకు గురి అవుతారు. అనుకోని ప్రయాణముల వలన ఖర్చు అధికమవుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఎక్కడ అయినా మీ పని పట్ల నిర్లక్ష్యం పనికి రాదు. లేకపోతే మీ సమస్యలు మరింత పెరిగే అవకాశములు ఉంటాయి. కొత్త వ్యవహారములు, నూతన ప్రణాళికలకు ఇది అంత అనుకూలమైన సమయం కాదు, కంగారు పడకండి. మీ ఆరోగ్యంతో పాటు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయడం చెప్పదగిన సూచన.

మీనం: మీన రాశి వారికి ఈవారం ఒక విధంగా మీ బుద్ధి బలానికి పరీక్షా సమయం అని చెప్పవచ్చు. ఏ విధమైన సమస్యలు వచ్చినప్పటికీ మీ తెలివితేటలతో, ఆలోచనలతో బయటపడతారు. వ్యాపారస్తులకు లాభములు వున్నప్పటికీ మీకు సన్నిహితంగా ఉండే వారితో చిన్నపాటి మనస్పర్దలు ఉండవచ్చు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. సంతానపరంగా బాగుంటుంది. వారి అభివృద్ధి బాగుంటుంది. మంచిపేరు సంపాదిస్తారు.ఆర్థికపరంగా డబ్బులు విషయంలో లోటు ఉండ దు. క్రీడారంగంలో ఉన్న వారికి బాగుంటుంది. వాహనములు నడిపేటప్పుడు, ప్రయాణములలో జాగ్రత్త వహించండి. అంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన.

సోమేశ్వర్ శర్మ
వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
84669 32223
90141 26121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News