Thursday, January 23, 2025

వార ఫలాలు 26-11-2023 నుంచి 02-12-2023 వరకు

- Advertisement -
- Advertisement -

మేషం: ఈవారం మేషరాశి వారికి అన్ని విధాలా కొంత జాగ్రత్త వహించవలసిన సమయం గా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులతో  లేనిపోని ఆందోళనలు, పని ఒత్తిడి ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. కార్యాలయాలలో కానీ, పని చేసే చోట కానీ మీ యొక్క బాధ్యత విషయంలో  అశ్రద్ధ వహించకండి. అనుకున్న పనిని అనుకున్న సమయంలో  పూర్తి  చేయడం మంచిది. వాయిదా  వేయడం మంచిది కాదు.ఆర్ధిక పరంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశములు వున్నాయి . ఋణములు, లోన్లు వంటి వాటి  విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఉండవచ్చు. అప్పులు తీర్చాలన్న మీ సంకల్పం కొంత మేర నెరవేరుతుంది. ఆర్థికాభివృద్ధి బాగున్నప్పటికీ ఎదో తెలియని ఆందోళన గురవుతారు.వ్యాపారస్తులకు వ్యవహారముల విషయంలో చిక్కులు ఏర్పడవచ్చు, జాగ్రత్త వహించండి.  కోపం, ఉద్రేకం ఉండే అవకాశములు ఉన్నాయి. నిర్ణయాలను నిదానంగా ఆలోచించి తీసుకోవాలి. కుటుంబ పరంగా  జీవిత భాగస్వామితో  స్వల్ప విరోధములు ఉండే అవకాశములు ఉన్నాయి. ఖర్చులు అధికం అవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. ఏది ఏమైనప్పటికి నిరాశ పడకుండా పట్టుదలతో ముందుకు సాగండి. మంచి ఫలితాలను అందుకుంటారు. దైవానుగ్రహం తోడుంటుంది.ఈ రాసి వారు సుబ్రమణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన.

వృషభం:వృషభరాశి వారికి ఈ వారం అన్ని విధముల కొంత మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఉత్సాహంగా పని చేస్తారు, నూతన అవకాశాలు బాగుంటాయి. మీ మీద బురద జల్లెవారికి సరైన సమాధానం చెబుతారు. కుటుంబ పరంగా పెద్దల అండదండలు ఉన్నప్పటికీ జీవిత భాగస్వామితో చిన్న పాటి మాట పట్టింపులు ఉండే అవకాశములు ఉన్నాయి. అయితే మీ యొక్క సొంత తెలివితేటలు, నిర్ణయములు మంచి ఫలితాలను అందిస్తాయి. వ్యవహారములు, కోర్ట్ కేసులు వంటి విషయంలో కొంత మానసిక ఒత్తిడి తరువాత ప్రశాంతత వస్తుంది.వ్యాపారస్తులకు కొంత వ్యయ ప్రయాసలు పడినప్పటికీ ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. శత్రువర్గం నుండి ఏదైనా సమస్యలు ఉన్నట్లైతే కొంత సానుకూలత ఏర్పడే అవకాశములు గోచరిస్తున్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు.నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి మంచి ఫలితాలుండే అవకాశాలు గోచరిస్తున్నాయి.సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలమైన అసమయం అని చెప్పవచ్చు. విదేశీ వ్యవరాహాలు అనుకూలిస్తాయి. చదువులో ఆటంకాలు వున్నాయి. వాటి మీద ద్రుష్టి సారించండి.  సుబ్రమణ్య పాశుపత రూపు ధరించండి. మంచి ఫలితాలుంటాయి..

మిథునం:మిథునరాశి వారికి ఈ వారం వ్యవసాయ దారులకు, కళారంగం వారికి, సినిమా రంగం వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు.ఇనుము సంబంధించిన వ్యాపారస్తులకు అభివృద్ధి బాగుంటుంది. అయితే లాభములతో పాటు పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తారు. వ్యాపార అభివృద్ధికి పాటు పడతారు. వ్యవహారములు, నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయములలో అనుకున్న పనులు నెరవేరుతాయి. అధికారులతో సఖ్యత  ఏర్పడుతుంది. శత్రువర్గంనుండి కొంత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి.వృత్తి, ఉద్యోగములు పట్ల అనుకూలమైన  పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోయే అవకాశములు ఉన్నాయి. ఆర్ధిక పరంగా అభివృద్ధి బాగుంటుంది.వివాహ విషయ వ్యవహారాలలో  చేసే ప్రయత్నములు  అనుకూలమైన ఫలితాలనిస్తాయి.   కుటుంబ శుభ కార్యముల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. అయితే ఏది ఏమైనప్పటికీ మీ ఆలోచనలు వేగంగా ఉంటాయి.సంతాన పరంగా మంచి పురోగతి బాగుంటుంది. నూతన విద్యా ప్రణాళికలకు, కొత్త కోర్సులు ప్రారంభించుటకు మంచి సమయం అని చెప్పవచ్చు. మీ సలహాలు వారికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

కర్కాటకం : ఈ వారం కర్కాటకరాశి వారికి అన్ని విధముల మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి. సాఫ్ట్ వేర్ రంగం వారికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు అనుకున్న పనులు పూర్తవుతాయి. నలుగురిలో  గౌరవం పెరుగుతుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారస్తులకు ప్రజా సంబంధమైన పలుకుబడి ఏర్పడుతుంది. ఆర్ధిక లాభములతో పాటు మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే మీరంటే గిట్టనివారు, మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వారి నుండి విమర్శలు,  దుష్ప్రచారాలు  వంటివి ఉండే అవకాశములు ఉన్నాయి. మీరు అవి పట్టించుకోకుండా ముందుకు సాగడం చెప్పదగిన సూచన.మీరు ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు పట్టుదలతో ముందుకు సాగడం మంచిది. విద్య విషయాలలో పోటీ పరీక్షలకు ఇది మంచి సమయం. అనుకున్న ఫలితములు సంప్రాప్తిస్తాయి. ప్రశంసలు అందుకుంటారు.ఈ రాశీ వారు హనుమాన్ చాలీసా పఠించడం, అంజనేయ స్వామి వారికీ ఆకు పూజ చేయడం చెప్పదగిన సూచన. అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.

సింహం: సింహరాశి  వారికి ఈవారం కొంత ప్రతికూలమైన ఫలితాలుండే అవకాశములు ఉన్నాయి. ఆర్ధిక పరంగా స్వల్ప ఇబ్బందులేర్పడవచ్చు. అనుకున్న సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం మీరు ఇవ్వవలసిన వారికి సకాలంలో చెల్లించక పోవడం వలన చిన్న పాటి అవమానములు ఏర్పడవచ్చు. అనుకున్న చోటు నుండి సహాయం అందక పోవడంతో కొంత మానసిక అశాంతికి గురి అవుతారు.ఉద్యోగస్తులకు బదిలీలకు, మార్పులకు ఇది మంచి సమయం కాదు, ప్రయత్నాలు చేయడం కూడా అంత మంచిది కాదు. ఉన్న వృత్తి, ఉద్యోగముల పట్ల శ్రద్ద వహించండి.వ్యాపారస్తులకు ఆర్థికంగా లాభములు ఉంటాయి. అయితే అంతర్గత విమర్శలు తప్పవు. కుటుంబం యొక్క  అభివృద్ధి, వారి సౌఖ్యం కొరకు పాటు పడినప్పటికీ ఎదుటి వారినుండి జీవిత భాగస్వామి నుండి విమర్శలు, చిన్నపాటి మాట పట్టింపులు ఉండే అవకాశములు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ఏది ఏమైనప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు.విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. నూతన కోర్సులు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు అలాగే విదేశాలలో వున్నా విద్యార్థులకు ఉద్యోగావకాశాలు ఆలస్యమైనా మంచి ఫలితాలు సంప్రాప్తిసాయి. ఈ రాశీవారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అలాగే కాలభైరవ రూపు ధరించడం శ్రేయస్కరం.

కన్య:కన్యారాశి వారికి ఈ వారం అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఏదైనా ఒక కొత్త పనులు, వ్యవహారములు, వ్యాపారములు ప్రారంభించుటకు మంచి సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి, ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్ల గురించి  ప్రయత్నములు చేసే వారికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి ఏర్పడే అవకాశములు ఉన్నాయి. అధికారం ఏర్పడుతుంది.వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందగలుగుతారు, లాభములతో పాటు అనుకున్న పనులు పూర్తవుతాయి. మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సాఫ్ట్ వేర్ రంగం వారికి, టెక్నీకల్ రంగం వారికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు స్థిరాస్తి వృద్ధి అయ్యే అవకాశములు ఉన్నాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయుటకు, నూతన వాహనములు కొనుగోలు చేయుటకు మంచి సమయం అని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు మంచి అభివృద్ధి కనబడుతుంది. నూతన  ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి మంచి అనుకూలమైన సమయం. అనుకున్న ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశీవారు శివాలయంలో అభిషేకం చేయడం అలాగే ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన అలాగే కాలభైరవ రూపు ధరించడం శ్రేయస్కరం.

తుల:తులారాశి వారికి ఈ వారం కొంత జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. వృత్తి  ఉద్యోగములు పట్ల తాత్కాలికంగా జరిగే అభివృద్ధిని చూసి ఆనందపడకండి, దాని వలన చేయబోయే పనిని కాస్త అశ్రద్ధ చేయడం జరుగుతుంది. వాయిదా వేయకుండా పనిని పూర్తి చేయండి.వ్యాపారస్తులకు శత్రువర్గం నుండి విమర్శలు, వెన్నుపోటు వంటివి ఎదురయ్యే ప్రమాదములు సూచిస్తున్నాయి. మీరు బాగా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసి మీ యొక్క అంతర్గత విషయాలు, వ్యాపార రహస్యములు బయట పెట్టె అవకాశములు ఉన్నాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి . అనుకున్న పనులలో ఆటంకములు , వృధా ప్రయాస పడే అవకాశములు ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగడం చెప్పదగ్గ సూచన. ఈ రాశీవారు శివాలయంలో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన.

వృశ్చికం:వృశ్చికరాశి వారికి కొంత ప్రతికూల ఫలితములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా సుఖశాంతులు నెలకొంటాయి. స్నేహితుల వలన సహాయం  పొందుతారు.ఉద్యోగస్తులకు అధికారుల నుండి నిరాదరణ ఏర్పడవచ్చు. అనుకున్న ప్రశంసలు అందుకోవడానికి బదులు విమర్శలు ఎదుర్కునే విధంగా అవకాశములు గోచరిస్తున్నా.  వ్యాపారస్తులకు వ్యవహారములు పట్ల కొంత ఆటంకములు ఏర్పడి ఫలితములు  అనుకున్న సమయం కంటే ఆలస్యం అయ్యే అవకాశములు ఉన్నాయి. ఆయితే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సొంత వారితో చిన్న పాటి అవమానములు , లేనిపోని అపవాదులు ఏర్పడే అవకాశములు ఉన్నాయి.ఎవరు ఎలాంటి నిందలు వేసినప్పటికీ మీరు అనుకున్న పనులు, వ్యవహారములు సకాలంలో చక్కబెడతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. అనుకున్న పనులు తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ రాసి వారు ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో నమో వెంకటేశాయ వత్తులతో దీపారాధన చేయడం  ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు.

ధనస్సు: ధనుస్సురాశి వారికి  అన్ని విధముల అత్యంత జాగ్రత్త వహించ వలసిన సమయంగా చెప్పవచ్చు.  ఏ విధంగా అయినా సరే అధికమైన ఖర్చులు ఉండే అవకాశములు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి  కంటే సహా ఉద్యోగస్థులతో స్వల్ప ఇబ్బందులు ఉండే అవకాశములు ఉన్నాయి. మీ పేరు చెడగొట్టడానికి మీ వెనుక   వచ్చే మాటలకు స్పందించడం మంచిది కాదు. ఓర్పు, సహనం వహించడం చెప్పదగ్గ సూచన. అయితే  ఇప్పుడు మీరు ఆవేశంలో మాట్లాడినట్లైతే శత్రువులకు మేలు చేసిన వారవుతారు. కాబట్టి మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసి మాట్లాడండి.  అయితే మీరు ఉన్న ఆందోళన పరిస్థితులలో మీకంటే తక్కువ వారితో స్నేహములు, వారికి మీ అంతర్గత విషయములు, సమస్యలు చెప్పడం కూడా మంచిది కాదు. విలాసములకు, వ్యసనములకు దూరంగా ఉండడం మంచిది.  వ్యాపారస్తులకు  అనుకున్న లాభములు ఉండకపోవచ్చు. చంచలమైన మనస్తత్వం కాకుండా స్థిరమైన ఆలోచలతో ముందుకు సాగడం చెప్పదగ్గ సూచన. స్నేహ వర్గం నుండి మంచి సలహాలు, సహాయ సహకారములు లభిస్తాయి. ఈ రాసి వారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

మకరం: మకరరాశి వారికి ఈ వారం మీ ఆలోచనలను అదుపులో పెట్టుకుని స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగినట్లయితే అన్నింటా విజయాలు  చేకూరుతాయని  చెప్పడంలో సందేహం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, ఇనుము వ్యాపారస్తులకు  మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. స్థిరాస్తి వృద్ధి చేసుకోవాలనుకునే వారికి అభివృద్ధి తప్పక ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగం పట్ల, ఆర్ధికంగా ఆదాయం పట్ల  అభివృద్ది ఉంటుంది.  కొంత ఓర్పు వహించినట్లైతే   ఉన్నతాధికారుల నుండి  ప్రసంశలు అందుకునే అవకాశములు ఉన్నాయి.  కుటుంబ పరంగా సంతోషం లభిస్తుంది. పెద్దలపై గౌరవాభిమానములు పెరుగుతాయి. జీవిత  భాగస్వామితో, కుటుంబంతో కలసి వినోద యాత్రలు చేసే అవకాశములు ఉన్నాయి. సంతానం విషయంలో సంతోషం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. గతంలో ఏదైనా ఇబ్బందికరమైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కొంత మేర కుదుట పడుతుంది.ఏలినాటి  శని నడుస్తున్నది వలన , 8 శని వారలు శని కి తైలాభిషేకం చేయడం అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన..

కుంభం: కుంభరాశి వారికి ఈ వారం గతంలో కంటే కొంత అనుకూలమైన ఫలితములు ఉండే అవకాశములు ఉన్నాయి. అన్నిటా శుభ ఫలితములు గోచరిస్తున్నాయి. వివాహాం కానీ వారికి వివాహ ప్రయత్నములు అనుకూలిస్తాయి. సంతాన పరంగా కూడా అనుకూలమైన ఫలితములుండె అవకాశములు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకు  మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి ప్రయత్నములు అనుకూలిస్తాయి. అయితే అన్ని పనులు నెరవేరుటకు శ్రమ అధికం అవుతుంది. నిర్లక్ష్యం చేయకుండా  అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు క్రమేణా అభివృద్ధి ఉంటుంది. అనుకున్న ఆర్ధిక లాభములు ఉంటాయి. మీరు చేసిని కృషికి మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. స్నేహ వర్గం వర్గంతో అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారస్తులకు మంచి అభివృద్ధితో పాటు తృప్తి ఏర్పడుతుంది. సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలంగా వుంది అని చెప్పవచ్చు. అయితే టెక్నీకల్ రంగం వారికి జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా కుటుంబ సభ్యులు అందరితో  కలయిక ఏర్పడుతుంది.  అయితే మీ  ఎదుగుదల ఓర్వలేని వారు  మీమీద బురద  చల్లే  అవకాశములు  ఉన్నాయి. అనారోగ్య  సమస్యలతో బాగా ఇబ్బంది పడే వారికి   కొంత సానుకూలత ఉంటుంది. అయితే ఎన్ని చేసిన వృధా శ్రమ అయ్యే అవకాశములు ఉన్నాయి. అయితే  అభివృద్ధి కనబడుతుంది.  అనుకున్న పనులు, మనోవాంఛలు సిద్ధిస్తాయి. ఆర్ధికంగా, అనుకున్న పనులు అనుకున్న  విధంగా లాభిస్తాయి..

మీనం:మీనరాశివారికిఈవారంమాధ్యమంగాఫలితాలుగోచరిస్తున్నాయి.ఉద్యోగస్తులకుఆర్థికాభివృద్ధిబాగుంటుందిఅలాగేప్రమోషన్స్ వచ్చే అవకాశాలున్నాయి. అయితేఅధికారులతోచిన్నపాటిఒత్తిడిఉంటుంది. వ్యాపారస్తులకువ్యవహారములుపట్లతగాదాలు, చిక్కులుఉన్నట్లైతేకొంతఊరటలభిస్తుంది. వృధా ప్రయాణములు, చిన్నపాటి అవమానములు మీమనో విచారమునకు కారణమవవుతాయి. ఎంత డబ్బు ఖర్చు అయినప్పటికీ, అవసరములకు ఎదో ఒకరకంగా డబ్బు చేతికి అందుతుంది.  ఆర్ధిక నష్టములు ఉన్నప్పటికీ వ్యవహారములు పట్ల విజయం సాధిస్తారు. కుటుంబ పరంగా జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. ఖర్చులు అధికం అవుతాయి. కుటుంబంలోబంధువర్గంలో, మీకంటే పెద్దవారితో తగాదాలు, వివాదాలు వచ్చే అవకాశములు ఉన్నాయి. కొంత ఓర్పు, సహనం వహించడం చెప్ప దగ్గ సూచన. శత్రువులు ఎవరైతే వుంటారో వారే మళ్ళీ స్నేహితులుగా చెలామణి అయ్యే అవకాశములు లేకపోలేదు. కాబట్టి అంతర్గత విషయాలు, వ్యవహారములు గోప్యంగా ఉంచుకోవడం మంచిది. ఈరాశీ వారు హనుమాన్చాలీసాపఠించడం, అంజనేయస్వామి వారికీ ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News