Monday, December 23, 2024

వార ఫలాలు (08-10-2023 to 14-10-2023)

- Advertisement -
- Advertisement -

మేషం:మేషరాశి వారికి ఈ వారం సర్వత్రా విజయములు వరిస్తాయని చెప్పవచ్చు.మీ మనోధైర్యానికి మించినది ఏదీ లేదని తెలుసుకుంటారు.ఉద్యోగస్తులకు పైఅధికారులతో కానీ, కార్యాలయంలలో కానీ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు నూతన ప్రణాళికలు, కొత్త  పద్దతులతో వ్యాపారాభివృద్ధికి ఆలోచనలు చేస్తారు. ప్రజాదరణ లభిస్తుంది. శత్రువర్గం కూడా అభినందించేలా నడుచుకుంటారు.నూతన  ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన ఫలితములు ఉంటాయి.  ఉద్యోగస్తులకు అభివృద్ధి , ప్రమోషన్లు వంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి.ప్రతి నిత్యం ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

వృషభం:వృషభరాశి వారికి ఈ వారం కుటుంబ పరంగా, కుటుంబంలోజరిగే కార్యకలాపాల పరంగా అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి.  అయితే పనుల విషయంలో జాప్యం వద్దు, ఆలస్యం చేసినట్లైతే ఆ పనులు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.  అనుకున్న పనిని వెంటనే అమలు చేయండి.వ్యవసాయ రంగంవారికి, బట్టల దుకాణం వారికి , చేతి వృత్తుల వారికి అనుకూలమైన సమయం.వ్యాపారంలో శత్రువర్గం నుండి ఇబ్బందులు తలెత్తవచ్చు. కుటుంబ పరంగా వ్యవహారాలు చేసేటప్పుడు సంతానంతో కానీ, జీవిత భాగస్వామితో కానీ మనస్పర్థలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి.ప్రతి నిత్యం కుబేర వత్తులతో  దీపారాధన చేయడం శ్రేయస్కరం

మిథునం:మిథునరాశి  వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు  గోచరిస్తున్నాయి. ఆచీతూచీ , ఆలోచించి మాట్లాడడం మంచిది. మీ విచక్షణ వలన మీ మాటకు విలువ ఏర్పడుతుంది. శత్రువులను పెంచేది, తగ్గించేది కూడా మాటే అనే విషయం అర్ధం చేసుకుని ప్రవర్తించడం మంచిది. ఋణాల విషయంలో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి.సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు సానుకూలత ఉంటుంది. వ్యాపారస్తులకు ప్రతికూల ఫలితాలుండే అవకాశాలున్నాయి.ఏదైనా ఒక పని మొదలు పెట్టేసరికి కొద్దిపాటి అంటంకాలు ఏర్పడతాయి. అలా అని పనిని ఆపవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు.కుబేర కుంకుమతో అమ్మవారిని పూజంచడం చెప్పదగిన సూచన.

కర్కాటకం :ఈ వారం ఉద్యోగ పరంగా అభివృద్ధి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ  పరంగా పైఅధికారుల నుండి, కార్యాలయాలలో అభివృద్ధి కనబడుతుంది. ఎవరైనా ప్రమోషన్లు, బదిలీలు వంటివాటికి ప్రయత్నాలు చేయవచ్చు. సానుకూల ఫలితాలు ఏర్పడతాయి.ఆర్ధిక పరంగా ధనం చేతికి వస్తుంది. అనుకున్న  పనుల గురించి ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ఖర్చు చేస్తారు. వ్యాపారస్తులకు కూడా విలాసవంతమైన జీవితం గడపటం, అధిక ఖర్చులు ఉంటాయి. కుటుంబ పరంగా సుఖం, సంతోషం లభిస్తాయి.కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కొంత అనుకూల ఫలితాలుండవచ్చు.నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

సింహం;సింహరాశి వారికి ఈ వారం కుటుంబ పరంగా, సంతాన పరంగా మంచి అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. కుటుంబంలో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నిస్తారు. వివాహాది శుభకార్యాల గురించి ఆలోచనలు, ప్రణాళికలు అధికం అవుతాయి. సంతానం యొక్క అభివృద్ధి గురించి పరితపిస్తారు.ఉద్యోగ పరంగా కొంత నష్టాలు, భయం ఉండే అవకాశాలు ఉన్నాయి.వ్యాపారస్తులకు కొంత అనుకూలత ఉంటుంది. ఇనుము, స్టీల్ వ్యాపారస్తులకు, విలాస వస్తువుల వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. వారం ప్రధమార్ధం కంటే ద్వితీయార్థంలో మంచి ఫలితాలను అందుకుంటారు.కార్యాలయంలో, ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో జిల్లేడు గణపతిని పెట్టడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.

కన్య:ఈ వారం కన్యారాశి వారికి  కొంత జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. మీరు తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు. అధైర్య పడకండి.   వృధా ప్రయాస  పడడం జరుగవచ్చు, జాగ్రత్త వహించండి. ఉద్యోగరీత్యా అధికారులతో అనుకున్న పనులు విషయంలో ఆలస్యంగా ఫలితాలుండే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులకు తాత్కాలిక లాభాలు, సుఖాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.వారం ప్రథమార్థంలోఅనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి, అనుకున్న పనులను వెంటనే ఆచరణలోకి పెట్టడం మంచిది.  శత్రువర్గం పట్ల కొంత జాగ్రత్త వహించండి. కొత్త పరిచయాలు, స్నేహాల విషయంలో జాగ్రత్త వహించండి.నిత్యం ఓం నమో వెంకటేశాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం.

తుల:తులారాశి వారికి ఈ  వారం ప్రతికూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుండి నిరాదరణ  ఏర్పడవచ్చు,  ప్రమోషన్లు, అభివృద్ధి వంటివి వాయిదాపడే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పనులలో ఆటంకాలు ఉండే అవకాశాలు ఎదురవుతాయి. కంగారు పడకండి. పని చేసే చోట, వృత్తి-వ్యాపారాల యందు  మీరంటే పడనీ వారి వలన వారు చేసే పనుల వలన కొంత మాట పడవలసి రావచ్చు.వ్యాపారస్తులకు కొద్దిపాటి అనుకూలత ఉంటుంది. అనవసరపు ఖర్చులు మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి. స్నేహితులతో, కుటుంబంలో సానుకూలత ఉంటుంది. సంతోషంగా గడిపే అవకాశాలు ఉన్నాయి.ఈ రాసి వారు 3 పోగుల వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

వృశ్చికం:వృశ్చికరాశి  వారికీ ఈ వారం  ఉద్యోగస్తులకు  అభివృద్ధి పరంగా  మంచి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.  ఆర్ధికంగా అనుకోని విధంగా  అభివృద్ధి ఉంటుంది. సంతాన పరంగా, కుటుంబ పరంగా సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు సైతం  కూడా ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులకు ఆర్థికాభివృద్ధి, ప్రమోషన్లు వంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో గౌరవం పొందుతారు. సంతానం కొరకు ప్రయత్నాలు చేసే వారికి మంచి సమయం అని చెప్పవచ్చు. వివాహా ప్రయత్నాలు చేసే వారికి ఈ వారం శుభ ఫలితంతాలు ఉంటాయి.నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

ధనస్సు:ధనుస్సురాశి వారికీ ఈ వారం  సర్వత్రా అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. సాఫ్ట్ వేర్ రంగం వారికి, టెక్నీకల్ రంగం వారికి ఉద్యోగ పరంగా అభివృద్ధి, ప్రశంసలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి అమ్మకాల కంటే కొనుగోలు చేసే సమయం, స్థిరాస్తి వృద్ధి అయ్యే సమయమని చెప్పవచ్చు. విద్యార్థులకు  వారి సామర్ధ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది.నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కూడా మీరు అనుకున్న విధంగా ఫలితములుండె అవకాశాలు గోచరిస్తున్నాయి.ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

మకరం:మకరరాశి వారికి  ఈ వారం శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏమి  మాట్లాడినా కుటుంబంలో కానివ్వండి. కార్యాలయంలో కానివ్వండి వారు తప్పుగా అర్ధం చేసుకుని అవి చిన్నపాటి తగాదాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి.కాబట్టి మీరు ఇది పరీక్షా సమయం గా భావించి ఓర్పు, సహనంతో ఉండడం మంచిది.వ్యాపార రంగంలో ఉండే వారు కూడా నిరాశ నిస్పృహలు  మంచిది కాదు. కష్టపడి, పట్టుదలతో ముందుకు సాగండి. భవిష్యత్తు  బాగుంటుంది.కొంత శ్రమ, ఒత్తిడి పడినప్పటికీ అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందడంతో అవసరముల మేరకు లోటు ఉండదు.కార్యాలయంలో, ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో జిల్లేడు గణపతిని పెట్టడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.

కుంభం:కుంభరాశి వారికి ఈవారం ఉద్యోగులకు, అధికారుల పట్ల కొంత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. స్వస్థానమునకు వెళ్లడం, కుటుంబానికి   ప్రాధాన్యత ఇస్తారు.  అయితే కుటుంబంలోని వారి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి.వ్యాపారస్తులకు లాభాలు మందకొడిగా సాగే అవకాశాలు ఉన్నాయి. సంతానం పట్ల అనుకూలత ఉంటుంది. వారి అభివృద్ధి పరంగా మీకు సంతోషం లభిస్తుంది. ఎదో ఒకరకంగా ఆర్ధిక  ఇబ్బందులు తొలగుతాయి.కుటుంబంలో భార్య భర్తల మధ్య బెదప్రాయం వచ్చే అవకాశాలు వున్నాయి. జాగర్త వహించిండి.కార్యాలయంలో, ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో జిల్లేడు గణపతిని పెట్టడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి..

మీనం:మీనరాశి వారికి ఈవారం జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగ పరంగా పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అప్పులు, లోన్లు విషయంలో కొంత ఇబ్బందులకు గురి అవుతారు. వ్యాపారస్తులకు ఎంత సంపాదన  ఉన్నప్పటికీ  పెట్టుబడుల రూపంలో కానీ, సేవింగ్స్ చేసినప్పటికీ నిత్యకృత్యంలో ఇబ్బందులు తప్పవు. ఏదైనా ఒక పని మొదలు పెడితే మధ్యలో అడ్డంకులు ఎదురవుతాయి, పని అవుతున్నప్పటికీ విమర్శలు వలన కొంత తోట్రుపాటు అనేది జరుగుతుంది.వ్యవహారాల విషయంలో అగ్రిమెంట్లు, హామీలు వంటి వాటిలో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది.ఈ రాసి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

 

సోమేశ్వర్ శర్మ
వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
84669 32223
90141 26121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News