Sunday, January 19, 2025

వార ఫలాలు (24-09-2023 నుంచి 30-09-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా లేదా కార్యాలయంలో కానీ, శత్రువుల బలం తగ్గే అవకాశములు సూచిస్తున్నాయి. ప్రమోషన్స్ వంటివి వచ్చే అవకాశాలు వున్నాయి. వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి ఉంటుంది. వ్యవహారములు పట్ల అనుకున్నది సాధిస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. అధికార వృద్ధి వుంది. సాఫ్ట్‌వేర్ రంగం వారు కొంచెం ఆలోచించి నిర్ణయములు తీసుకోవడం మంచిది. అనవసరమైన శ్రమ ఉండే అవకాశములు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈ వారం స్త్రీలకు బాగుంది అని చెప్పవచ్చు, పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. ఓం నమః శివాయ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

వృషభం: ఉద్యోగస్తులకు ఈ వారం సానుకూలంగా యధావిధిగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే మీరు సాఫీగా ఉన్నప్పటికీ శత్రువర్గం నుండి ఇబ్బందులు, విమర్శలు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఏ పని చేసిన ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు. అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. క్రయవిక్రయాలు సానుకూలత ఉంటుంది. వారం ప్రథమార్ధంలో మొదలు పెట్టిన పనులు ద్వితీయార్థంలో వచ్చే సరికి అనుకూలమైన శుభ ఫలితములను ఇస్తాయి. కళాకారులకు, సినిమా రంగం వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, చిన్నచిన్న పరిశ్రమలకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. జిల్లేడు వత్తులతో దీపా రాధన చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు.

మిథునం: ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఒత్తిడి ఉండే అవకాశములు ఉన్నాయి. ఏ పని చేసిన నిదానంగా సాగుతుంది. మీరు చేసే చిన్న చిన్న పనులవల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది. లాభాలు తక్కువగా ఉంటుంది. పార్టనర్స్ మధ్య అంతర్గత విమర్శలు తప్పవు. వ్యాపారంలో స్నేహితులను కూడా ఎక్కువగా నమ్మడం మంచిది కాదనే విషయాన్ని తెలుసుకుంటారు. ఈ వారం స్త్రీలకు సామాన్యంగా ఉంటుంది అని చెప్పవచ్చు, ఉద్యోగస్తులకు కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వుండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుబేర కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన సూచన.

కర్కాటకం : ఈ రాశి వారికి ఉద్యోగం పట్ల అధికారం అభివృద్ధి అవుతుంది. మీరు దానిని బాధ్యతగా భావిస్తారు. అయితే పనులు వాయిదా పడే అవకాశములు ఉన్నాయి, కానీ నష్టములు ఉండవు. ఆందోళన చెందకండి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికీ చిన్న అపవాదులు ఉండవచ్చు. కుటుంబ పరంగా నూతన వస్తువు కొనుగోలు చేసే అవకాశములు ఉన్నాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. రియల్ ఎస్టేట్ , స్టీల్, సినీ రంగం వారికి కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. ఈ వారం స్త్రీలకు అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒడిదొడుకులు వుండే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. ముత్యపు గణపతి లాకెట్ ధరించడం చెప్పదగిన సూచన.

సింహం: ఉద్యోగస్తులకు ఈ వారం సాధారణంగా ఉండే అవకాశములు ఉన్నాయి. పని వత్తిడి వుండే అవకాశం వుంది. పనికి తగ్గ శ్రమ లభించక పోవడం మీ మనోవేదనకు గురి చేస్తుంది. వ్యాపారస్తులకు కొంత నష్టములు, అశాంతి ఉండే అవకాశములు ఉన్నాయి. అనాలోచిత ఖర్చుల వలన ఆర్ధిక ఇబ్బందులు ఉండవచ్చు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయములు తీసుకోండి. ఈ వారం స్త్రీలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా అతి కష్టం మీద పనులు నెరవేరుతాయి. ఎంత పెద్ద పనైనా మీ ఆలోచన శక్తితో ముందుకు సాగుతారు. ఏ విషయమైనా జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ప్రతి నిత్యం ఓం నమో వెంకటేశాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం.

కన్య: ఉద్యోగస్తులకు ప్రతికూల ఫలితములు ఉండవచ్చు. అధికారులతో ప్రతికూల వాదనలు, వృథా ప్రయాసలు ఉండే అవకాశములు ఉన్నాయి. ఉద్రేకాలకు పోయి తగాదాలకు వెళ్లడం మంచిది కాదు. ఉద్యోగంలో మార్పులుకు ప్రయత్నములు అంత మంచిది కాదు. వ్యాపారస్తులకు ఆర్ధిక పరంగా లాభములు మిశ్రమంగా ఉంటాయి. ఆనందపడేంత లాభములు లేనప్పటికీ నష్టములు ఉండే సూచనలు తక్కువగా ఉన్నాయి. పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం స్త్రీలకు సామాన్యంగా వుంది అని చెప్పవచ్చు, జీవిత భాగస్వామితో సంతోషంగా కాలం గడుపుతారు. సంతాన అభివృద్ధి బాగుంటుంది. నమో వెంకటేశాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం.

తుల: ఉద్యోగస్తులకు కూడా సానుకూలత ఉంటుంది. కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం వుంది. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నములు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు ఈ వారం మంచి లాభాలు ఉండే అవకాశములు ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కొత్త పనులకు ఇది మంచి సమయం కాదు. సాఫ్ట్ వేర్ రంగం వారికి, కళారంగం వారికి అనుకూల అవకాశములు ఉంటాయి. ఆరోగ్యం పట్ల, శ్రద్ధ వహించండి. స్నేహితులతో సన్నిహితం మంచిది. ఈ వారం స్త్రీలకు బాగుంది అని చెప్పవచ్చు, ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఆలోచిస్తారు, ఉద్యోగ వ్యాపార విషయాలలో సానుకూలత ఉంటుంది. కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన.

వృశ్చికం: ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకూలత ఉంటుంది. ఉద్యోగస్తులకు యధావిధిగా వున్నప్పటికీ, ఏవో తెలియని చికాకులు, మానసిక ఆందోళనలు ఉండే అవకాశములు ఉన్నాయి. అధిక శ్రమ పెరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా అన్నింటా సత్ఫలితములు వున్నప్పటికీ చిన్నచిన్న విషయాలు పెద్దవి అయ్యే ప్రమాదములు కూడా ఉన్నాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఈ వారం స్త్రీలకు బాగుంది అని చెప్పవచ్చు, జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు వున్నాయి జాగ్రత్త వహించండి. ప్రతి నిత్యం దుర్గా అమ్మవారి స్తోత్రం పఠించండి చెప్పదగిన సూచన..

ధనస్సు: ఉద్యోగస్తులకు సానుకూలత యధావిధిగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ధన ప్రాప్తి వుంది. వ్యాపారస్తులకు కూడా ఆర్ధికంగా లాభములు ఉంటాయి. టెక్నికల్ రంగములు వారు కొంత జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి ఫలితములు ఉన్నప్పటికీ ఆర్ధికంగా మీరు అనుకున్న ఉద్యోగం రాకపోవచ్చు. ఈ వారం స్త్రీలకు ఇంట బయట అన్ని విధాలుగా అనుకూలం. ఉద్యోగంలో పురోగతి బాగుంటుంది. ఈ రాశి వారు ప్రతి నిత్యం కుబేర వత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం, విద్యార్థిని విద్యార్థులు విద్య పట్ల కాస్త శ్రద్ధ వహించండి..

మకరం: ఉద్యోగస్తులు, సాఫ్ట్‌వేర్ రంగం వారికి, అలాగే టెక్నాలజీ పరంగా కన్సల్టెన్సీ వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. మానసిక ఆందోళనలు, విచారములు ఎన్ని ఉన్నప్పటికీ మీ యొక్క సొంత ఆలోచనలు, తెలివితేటలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎంత కష్టపడినా ఇంతే ప్రతిఫలం అని బాధపడే అవకాశములు ఉన్నాయి. ప్రమోషన్స్‌కి ఇది అంత అనుకూలమైన సమయం కాదని చెప్పవచ్చు. కుటుంబపరంగా, జీవిత భాగస్వామితో కానీ, కుటుంబంలో కానీ చిన్నపాటి మనస్పర్దలు ఉండే అవకాశములు ఉన్నాయి. మీరు సరైన సమాధానం చెప్పకపోవడం ఒక కారణమవ్వవచ్చు. ప్రతి నిత్యం హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం.

కుంభం: ఉద్యోగపరంగా ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు, అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. కొత్త ప్రాజెక్టు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సహనం పాటించాలి. వ్యాపార పరంగా అంత అనుకూలంగా వున్నా ఎదో తెలియ ఆందోళన చెందుతారు. ఇంట బయట విరోధం ఎక్కువవుతుంది. మీ అనాలోచిత నిర్ణయాల వల్ల వ్యాపారంలో విభేదాలొచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త వహించండి. మాటపట్టింపులకు పోయి ఇబ్బందులు తెచ్చి పెట్టుకోకండి. ఇంట్లో వాళ్ల వలన మనో వేదనకు గురి అవుతారు. నలుపు వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

మీనం: ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది. కష్టపడినా దానికి ఫలితం తక్కువగా ఉంటుంది. మీ కింద టీం తో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఏ పని చేసిన నిదానంగా సాగుతుంది. వ్యాపాస్తులకు వ్యవహారాల పట్ల నిర్ణయాలు అలోచించి తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఎక్కువ ఆలస్యం అయ్యే అవకాశములు ఉన్నాయి. శుభకార్యముల విషయంలో పెద్దల సలహాలు తీసుకుని చేయడం మంచిది. ఆర్ధికంగా అంత అభివృద్ధి తక్కువగా ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నములు అనుకూలిస్తాయి. ప్రయత్నములు ముమ్మరం చేయండి. కార్యాలయంలో, ఇంట్లో, వ్యాపా ర ప్రదేశాలలో జిల్లేడు గణపతిని పెట్టడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి..

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News