Monday, December 23, 2024

వార ఫలాలు (15-10-2023 to 21-10-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: ఈ వారం మేషరాశి వారికి ప్రథమార్ధంలో అన్ని విధముల బాగుంటుంది. వ్యాపారస్తులకు ఈ వారం లాభసాటిగా సాగుతుంది. నమ్మకంతో ముందుకు సాగండి. వ్యాపారానికి నమ్మకమే పెట్టుబడి అని మరచిపోవద్దు. బిజినెస్ ఎక్సపన్సాయిన్ చేసే వారికి ఈ వారం మంచి కాలం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు సానుకూలంగా, నిదానంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. మానసిక ధైర్యం ఏర్పరచుకోండి.నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసేవారికి మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్ధిక అభివృద్ధి కనబడుతుంది. ఈ వారం స్త్రీలకు బాగుంది అని చెప్పవచ్చు, పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది.

వృషభం: వృషభరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉందని చెప్పవచ్చు. కొంత ఓర్పు, సహనం వహిస్తే అన్ని విధాలా అనుకూలమైన ఫలితములు ఉంటాయి. ఉద్యోగస్తులకు చిన్నచిన్న సమస్యలు వచ్చినప్పటికీ మీ తెలివితేటలు, శక్తిసామర్ధ్యములతో పరిష్కరించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి ప్రయత్నములు ఫలించే అవకాశములు ఉన్నాయి. శుభ కార్యక్రమముల విషయాలు, వ్యవహారములు ఈ వారం ద్వితీయార్థంలో ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తులకు ప్రజాదరణ పెరుగుతుంది. సాఫ్ట్‌వేర్ రంగం వారికి, టెక్నికల్ రంగం వారికి కూడా అభివృద్ధి బాగుంటుంది.ఈ వారం స్త్రీలకు బాగుంది అని చెప్పవచ్చు, వ్యాపారస్తులకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది.

మిథునం: మిథునరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి. అంతవరకు మీతో స్నేహముగా ఉండి మీ మాటకు విలువ ఇచ్చేవారు మీరు ఊహించని విధంగా మారే అవకాశములు ఉన్నాయి.ఏ విధమైన రహస్యములు కాని, వ్యవహారములు కాని అందరితో చర్చించుకోవడం మంచిది కాదు. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు సానుకూలత ఉంటుంది. సాఫ్ట్‌వేర్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తులకు ప్రతికూల ఫలితాలుండే అవకాశాలున్నాయి. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. అయితే మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోండి.

కర్కాటకం: ఈ వారం కర్కాటకరాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి బాగుంతుంది. కుటుంబంలో వారి సహాయ సహకారములు ఉంటాయి. కుటుంబంలో సంతోషం కొరకు, వారి కోసం చేసే ఖర్చులు అధికం అవుతాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖర్చులకు వెనుకాడకుండా ఖర్చుపెడతారు. ఆరోగ్యపరముగా కొంత జాగ్రత్త వహించండి. వాహనములు నడిపేటప్పుడు, ప్రయాణములలో జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సామాన్యంగా వుంది అని చెప్పవచ్చు, ఉద్యోగ, వ్యాపారాల్లో చిన్నచిన్న సమస్యలు వుండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. నిత్యం ఖడ్గమాలా స్తోత్రం పఠించండి చెప్పదగిన సూచన.

సింహం: సింహరాశి వారికి ఈ వారం అన్ని విధముల అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరముగా మంచి పేరు, గుర్తింపు లభించే అవకాశములు ఉన్నాయి. ప్రమోషన్స్ వంటివి వచ్చే అవకాశం ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులకు అనుకున్న లాభములను పొందగలుగుతారు. నూతన వస్తువులు కొనుగోళ్లు చేస్తారు. క్రయవిక్రయాలు బాగుంటాయి. ఈ వారం స్త్రీలకు జీవిత భాగస్వామితో విభేదాలువచ్చే అవకాశాలు వున్నాయి జాగ్రత్త వహించండి. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి బాగుంతుంది.మీ తెలివి తేటలు, సమయస్ఫూర్తితో పనులను త్వరగా పూర్తి చేయగలుగుతారు. సంతానపరంగా సౌఖ్యం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నములు చేసే వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు.

కన్య: ఈ వారం కన్యారాశి వారికి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, శ్రమ అధికం అయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు తాత్కాలిక ఆనందం కలుగుతుంది. లాభములు తక్కువగా ఉన్నప్పటికీ నష్టములు లేనందుకు సంతోష పడతారు.స్నేహములు చేసేటప్పుడు వారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారనే విషయం కంటే వారి వ్యక్తిగత విషయాలు దృష్టిలో ఉంచుకుని స్నేహం కొనసాగించుట మంచిది. ఈ వారం స్త్రీలకు సానుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు, వ్యాపారస్తులకు లాభాలు తక్కువగా ఉంటుంది. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వ్యాపారంలో స్నేహితులను కూడా ఎక్కువగా నమ్మడం మంచిది కాదనే విషయాన్ని తెలుసుకుంటారు.

తుల: తులారాశి వారికి ఈ వారం కొంత జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. కుటుంబంలోని వారితో, మనం సొంతం అనుకునే వారితో చిన్నపాటి తగాదాలు, విరోధములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. వృథా ప్రయాస, శ్రమ ఉండే అవకాశములు వున్నాయి అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార లాభం వుంది. అయితే శత్రువర్గం నుండి నష్టములు ఉండవచ్చు జాగ్రత్త వహించండి. వ్యాపార ప్రదేశాలలో ధూపం వేయడం వలన నరదిష్ఠి తొలగుతుంది. ఈ వారం స్త్రీలకు అనుకూలంగా వుంది. మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది.

వృశ్చికం: వృశ్చికరాశి వారికి ఈ వారం ప్రథమార్ధంలో అనుకూలమైన ఫలితములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. ఏదైనా కొత్త పనులు మొదలు పెడితే జాప్యం చేయకుండా తొందరగా అనుకున్న సమయానికి చేసుకోవడం మంచిది. సంతానపరంగా, గృహమందు సంతోషం లభిస్తుంది. స్నేహితులతో గౌరవం, మానసిక సంతృప్తి లభిస్తుంది.స్నేహితుల వలన సహాయ సహకారములు లభిస్తాయి. ఉద్యోగాభివృద్ధి తప్పక ఉంటుంది. మానసిక వత్తిడి ఎక్కువవుతుంది. ప్రణాళిక పద్ధతిలో వెళ్ళండి విజయం సిద్ధిస్తుంది. ఈ వారం స్త్రీలకు సంతోషకరమైన వార్తలు వింటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారం బాగుంటుంది. ప్రమోషన్స్ లేదా ట్రాన్స్‌ఫర్లు ఉంటాయి.

ధనస్సు: ఈ వారం ధనుస్సురాశి వారికి అన్ని విధముల అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు.ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి, బదిలీలు వంటి విషయములో అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. ప్రయత్నాలు చేయండి. రియల్ ఎస్టేట్ రంగం వారికి భూసంబంధమైన వ్యాపారస్తులకు మంచి లాభములు ఉండే అవకాశములు ఉన్నాయి. స్థిరాస్తి వృద్ధి చేసుకోవాలనే కోరిక సిద్ధిస్తుంది. అలాగే సాఫ్ట్‌వేర్ రంగం వారికి కూడా మంచి సమయం, ఉద్యోగంలో వృద్ధి, మనశ్శాంతి లభిస్తుంది.నూతన ఉద్యోగ ప్రయత్నములు కానీ, వివాహము కానీ వారికి వివాహ ప్రయత్నములు చేసే వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలుంటాయి. ఈ వారం స్త్రీలకు బాగుంది అని చెప్పవచ్చు, వృత్తి వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. సంతోషకరమైన వార్తలు వింటారు.

మకరం: మకరరాశి వారికి ఈ వారం శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ వారం ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలుండే అవకాశములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు వారం చివరలో కొంత ఊరట లభిస్తుంది. మానసిక ప్రశాంతత కొరకు పరితపిస్తుంటారు. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు వంటివి అంత మంచిది కాదు. ప్రస్తుత గ్రహగతులను బట్టి స్థానచలనం అంత మంచిది కాదు. కంగారు పడకండి. ఈ వారం స్త్రీలకు కార్యాలయంలో ఒత్తిడి ఉండే అవకాశములు ఉన్నాయి. ఏ పని చేసిన నిదానంగా సాగుతుంది. వ్యాపారస్తులకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది. లాభాలు తక్కువగా ఉంటుంది. అయితే మీ నమ్మకాన్ని వదలకుండా పని చేస్తారు. దాని వాళ్ళ మంచి ఫలితాలు కనిపిస్తాయి.

కుంభం: కుంభరాశి వారికి ఈ వారం కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. అన్ని విధాలా ఎదో ఒక రకంగా చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదైనా కొత్త వ్యవహారాలు, పనులు ఉంటె అవి ప్రస్తుతం మొదలు పెట్టకపోవడం మంచిది. భవిషత్తు ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు వృథా తిరుగుడు ఉండే అవకాశములు ఉన్నాయి. వృథా ప్రయాణములు, వాటి వల్ల వచ్చే ఆందోళనలు ఇబ్బందిపడవచ్చు. సంతానపరంగా ఆనందం లభిస్తుంది.మీరు ఎంత మానసిక ఒత్తిడికి గురి అయినప్పటికీ సంతానం అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ వారం స్త్రీలకు సామాన్యంగా ఉంటుంది అని చెప్పవచ్చు, కుటుంబపరంగా సంతోషంగా గడుపుతారు. నూతన వస్తువులు కొనుగోళ్లు చేస్తారు. వ్యాపారస్తులకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది.

మీనం: మీనరాశి వారికి ఈ వారం జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఉద్యోగపరంగా అధికారులతో చిన్నపాటి ఇబ్బందులు, పని ఒత్తిడి ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. అనుకోని ప్రయాణములు ఉండే అవకాశములు ఉన్నాయి. వారం ద్వితీయార్థంలో మీరు అనుకున్న సమయానికి డబ్బులు చేతికి అందడం పాతబాకీలు ఏమైనా ఉంటె అవి చెల్లిస్తారు. ఇతరుల వ్యవహారాల విషయాలలో తలదూర్చడం మంచిది కాదు. ఎవరికీ సలహాలు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. వాహనములు నడిపేటప్పుడు జాగ్రత వహించండి. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ వారం స్త్రీలకు వ్యాపారం బాగుంటుంది. ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. సంతాన అభివృద్ధి ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

సోమేశ్వర్ శర్మ
వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
84669 32223
90141 26121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News