Tuesday, December 24, 2024

త్వరలో ఉద్యోగాల భర్తీ ప్రకటనలు?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : గత ఏడాది పేపర్ లీకేజీలతో రద్దయిన పరీక్షలు, వాయిదా పరీక్షలకు షెడ్యూల్‌తో పాటు త్వరలో పలు కొత్త నోటికేషన్లు వెలువడే అవకాశం ఉంది. ముందుగా వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. తొమ్మిది శాఖల్లో 60 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, మొత్తం పోస్టుల సంఖ్య 563కు చేరింది. త్వరగా గ్రూప్ -1కు సంబంధించిన నోటిఫికేషన్, షెడ్యూల్‌ను జారీ చేసి నియామక ప్రక్రియ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి)ని ఆదేశించిన విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో 60 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తుందా…? లేక 2022 ఏప్రిల్ 26న విడుదలైన పాత నోటిఫికేషన్‌కు అనుబంధ ప్రకటన జారీ చేసి మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా..? అనే విషయంపై టిఎస్‌పిఎస్‌సి తీసుకునే నిర్ణయంపై నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఫలితాల విడుదలపై దృష్టి…
రాష్ట్రంలో ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు ఫలితాలు వెలువడించడంపై టిఎస్‌పిఎస్‌సి దృష్టి సారించింది. చైర్మన్, సభ్యులతో పాటు కమిషన్‌కు కొత్త కార్యదర్శి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసిన కమిషన్, ఇటీవల వివిధ విభాగాల్లో 547 పోస్టుల భర్తీకి ఆరు ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదల చేసింది. అంతకుముందు భూగర్భ జలవనరుల శాఖ ఉద్యోగ పరీక్షల ఫైనల్ కీ, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు 20న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News