Wednesday, January 22, 2025

44 వేల ఖాళీ టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వానికి ఆర్ కృష్ణయ్య డిమాండ్
విద్యాశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడి

హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ గా ఉన్న 44 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి వెంటనే నోటిఫికేషన్ జారీచేయాలని రాజ్యసభ సభ్యులు, జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఖాళీ టీచర్ పోస్టుల భర్తీ డిమాండ్‌తో మంగళవారం నీరుద్యోగ ఆభ్యర్ధులు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. టీచర్ పోస్టులు భర్తీ చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయనన్నారు. తెలంగాణజెఎసి ఛైర్మన్ నీల వెంకటేష్, గుజ్జ కృష్ణ నాయకత్వంలో జిరిగిన ఈ ముట్టడి కార్యక్రమంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 24 వేల టీచర్ పోస్టులు, ఎయిడెడ్ పాఠశాలల్లో 4900 టీచర్ పోస్టులు, ఆదర్శ పాఠశాలల్లో 2000, కస్తుర్భా పాఠశాలల్లో 1500 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇవిగాకుండా ప్రభుత్వ పాటశాలల్లో 4 వేల కంప్యూటర్ టీచర్ పోస్టులు, 10 వేల పి.ఇ.టి పోస్టులు, 5 వేల ఆర్ట్, క్రాఫట్స్, డ్రాయింగ్ పోస్టులు, 3 వేల లైబ్రేరియన్ పోస్టులు, 4 వేల జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 10 వేల అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇంత పెద్దఎత్తున ఖాళీగా ఉంటె భర్తీ చేయకుండా ఇటు విద్యార్థుల భవిష్యత్ అటు నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద కులాల పిల్లలు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి -కుటుంబాల పిల్లలు చదువు కొనే ప్రభుత్వ పాఠశాలలో టీచర్లను నియమించకుండా వీరి అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని విమర్శించారు.

టీచర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతోందని, విద్యా ప్రమాణాలు దెబ్బ తింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్ట్ టైం టీచర్లు, గెస్ట్ టీచర్లు, ఆవర్లి బేస్డ్ టీచర్లు, విద్యా వాలంటరీలు, కాంట్రాక్ట్ టీచర్లు అంటూ రకరకాల పేర్లతో సంవత్సరాల తరబడి తాత్కాలిక టీచర్లను నియమించి విద్యా వ్యవస్థను పాడు చేశారని ధ్వజమెత్తారు. ఈ ముట్టడి కార్యక్రమంలో వేముల రామ కృష్ణ, భూపేష్ సాగర్, అనంతయ్య, రాజేందర్ , జోషి, రాము, నిఖిల్ పటేల్, రాందేవ్ మోడి, శిరీష, లావణ్య, ఊర్మిళ, శ్రీలత ,శ్రీదేవి, వాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News