Sunday, December 22, 2024

ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి: డివైఎఫ్‌ఐ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 22 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఈరోజు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు శాంతియుతంగా ధర్నా చేస్తున్న డిఎడ్, బిఎడ్ అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేసి అరెస్టు చేయడాన్ని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు కోట రమేష్ ఆనగంటి వెంకటేష్ లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో లో సుమారు 22 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 5089 పోస్టులను మాత్రమే ఖాళీగా ఉన్నాయని డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని ప్రకటించడం నిరుద్యోగ యువతను మరొకసారి మోసం చేయడమే అన్నారు.

ఇప్పటికే కోచింగ్ లు తీసుకొని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీవ్ర ఆవేదన చెందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ లో 13500 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు.కానీ అన్ని పోస్టులను క్రమేణా కుదించి కేవలం 5089 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించడం నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడటమే అన్నారు.ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకారమైనా 13500 పోస్టులను భర్తీ చేయాలని అడిగితే అభ్యర్థులపై పోలీసులతో లాఠీచార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చామని, ప్రభుత్వం స్పదించక పోతే మెగా డిఎస్సీ ద్వారా 22 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డివైఎఫ్‌ఐ అధ్వర్యంలో ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News