న్యూఢిల్లీ : పౌరులు ఇకపై కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను వాట్సాప్‌తో సెకండ్ల వ్యవధిలో పొందవచ్చు. ఈవిషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కార్యాలయం ఆదివారం తెలిపింది. ఇప్పటివరకూ పౌరులు టీకాలు పొందిన తరువాత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లకు వేచి ఉండాల్సి వచ్చేది. కొవిన్ పోర్టల్‌కు లాగ్ కావల్సి వచ్చేది. సామాన్యుడు కూడా వాడుతున్న సెల్‌ఫోన్లు, సంబంధిత వాట్సాప్ సాంకేతిక ప్రక్రియ ద్వారా వారికి అత్యవసరమైన ప్రయోజనం దిశలో వెంటనే టీకా పత్రం పొందే ఏర్పాటు చేశారని కార్యాలయం తెలిపింది. మై గవ్ కరోనా హెల్ప్‌డెస్క్ ద్వారా మూడు తేలికపాటి దశలతో దీనిని పొందవచ్చు.
1+91 9013151515 కాంటాక్టు నెంబర్ సేవ్ చేసుకోవాలి
వాట్సాప్‌లో కొవిడ్ సర్టిఫికెట్ అని టైప్ చేయండి
తరువాత మొబైల్‌కు వచ్చే ఓటిపిని నమోదు చేసుకోండి
ఇక మీకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఫోన్‌ద్వారానే అందుతుంది.