Saturday, November 23, 2024

ప్రజల వద్దకే కరోనా టీకా

- Advertisement -
- Advertisement -

Vaccination drive in Farm land

మన తెలంగాణ/వాజేడు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జగన్నాథపురం, కొంగల, గ్రామలలో పంచాయతీ, పాఠశాల, సబ్ సెంటర్ పరిధిలో కరోనా టీకాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. పల్లెల్లో వ్యవసాయ పనులు నడుస్తుండడంతో ప్రజలు పిహెచ్‌సికి వచ్చి టీకా తీసుకునేంత సమయం ఉండదు. దీన్ని దృష్టిలో పేట్టుకుని గ్రామాల్లోనే శిబిరం తరహాలో పంపిణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరో వైపు పల్లెల్లో వ్యాక్సినేషన్ వేగం పెంచాలని ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం రోజుకు కనీసం 500 మందికి టీకాలు వేయాలని డిఎంహెచ్‌వఒ పిహెచ్‌సి వైద్యాధికారులకు లక్ష్యం విధించారు. పంచాయతీ కార్యాలయం, పాఠశాల, సబ్ సెంటర్లలో టీకా నిర్వహిస్తున్నారు. ఇలా రోజుకొక గ్రామాన్ని ఎంచుకుంటు, ముందురోజు చాటింపుతో సమయం తెలియజేస్తున్నారు. కాగా, ఈ కేంద్రాల్లో మొదటి డోసుతో పాటు రెండో డోసు కూడా ఇస్తున్నారు.

రిజిస్టేషన్ ఇబ్బందులు లేకుండా..

టీకా తీసుకునేందుకు కొవిన్ యాప్ లో నమోదు గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా నిరక్షరాస్యులకు కొంత ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు పల్లెల్లోనే టీకా ఇస్తుండడంతో ఏ సమస్య లేకుండా ఆధార్ కార్డు, పోన్ నంబరుతో స్పాట్ రిజిస్టేషన్ చేయనున్నారు. అనంతరం పెనుగోలు కాలనీలో ఆరోగ్య శిబిరం నిర్వహించి గర్భవతులకు, బాలింతలకు,ఆరోగ్య పరీక్షలు, జ్వరంతో బాధపడుతున్న వారిని ప్రధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ వైద్యాధికారి సౌర్య, సిహెచ్‌ఒ సూర్యప్రకాస్ రావు, ఆరోగ్య పర్యవేక్షకుడు కొట్టి రెడ్డి, శేఖర్, ఆశకార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News