Monday, December 23, 2024

హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్

- Advertisement -
- Advertisement -
  • జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.కాశీనాథ్

సిద్దిపేట: హజ్ వెళ్లే యాత్రికులకు హజ్ హౌస్ సిద్దిపేటలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.కాశీనాథ్ తెలిపారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హజ్ హౌస్‌లో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ జె. కాశీనాథ్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల నియంత్రణ అధికారి డాక్టర్ సాయిరాం అధ్యక్షతన హజ్ వెళ్లే యాత్రికులకు వ్యాక్సినేషన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందస్తు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా 60 మంది హజ్ యాత్రికులకు పోలియో, మెదడువాపు, సీజనల్ ఇన్పుఎంజా బారిన పడకుండా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారు ఖ్ హుస్సేన్, డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ కంటి వెలుగు, హజ్ సొసైటీ కోఆర్డినేటర్ లతీఫ్ ఖాన్ , హజ్ ప్రెసిడెంట్ తాయారు హుస్సేన్, సెక్రటరీ పార్కు దిన్ ముస్లిం మత పెద్దలు గురువులు, జకీర్ హుస్సేన్ సిహెచ్‌ఓ, కైలాష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News