Saturday, November 16, 2024

ఏప్రిల్ 1 ‘@ 45’

- Advertisement -
- Advertisement -

Vaccination from April 1 for all those over 45 years of age

45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ 1 నుంచి టీకా
రిజిస్ట్రేషన్ తప్పనిసరి : కేంద్రం ప్రకటన
ట్రిపుల్ ‘టి’పై దృష్టి పెట్టండి
కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను
కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించండి
మాస్క్‌లు ధరించని వారిపై జరిమానాలు
రాష్ట్రాలకు కేంద్రం తాజా మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్య ంలో కేంద్ర ప్రభుత్వం మరో ప్రాధాన్య నిర్ణ యం తీసుకుంది. 45 ఏళ్లు పైబడినవారందరికీ ఏప్రిల్ 1 నుంచి కరోనా టీకా అందిస్తామని మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే మొదటి దశ వ్యాక్సినేషన్ కింద పారిశుద్ధ కార్మికులకు, వైద్యసిబ్బందికి టీకా అందిస్తోంది. రెండో దశలో 60 ఏళ్లు దాటిన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 నుంచి 59 సంవత్సరాల వారికి టీకా ఇస్తోంది. ఇప్పుడు కరోనా ఉద్ధృతి ని దృష్టిలో పెట్టుకుని యువతకు, 45 ఏళ్లు పైబడినవారికి ప్రాధాన్యం కల్పించింది. 45 ఏళ్లు పైబడిన అర్హులైన ప్రతి ఒక్కరు టీకా కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ విజ్ఞప్తి చేశారు. కరోనా టాస్క్‌ఫోర్స్ నిపుణులు ఇచ్చిన సూచనల మేర కు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాత్రికేయులకు వివరించారు.

మార్చి 22 వరకు ప్రభుత్వం 4,84,94,594 టీకా డోసులను పంపిణీ చేసింది. మరోవైపు దేశంలో కరోనా ఉధృతి మళ్లీ కొనసాగుతున్న వేళ కేంద్రం రాష్ట్రా లు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా కేసులు పె రుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌పై మరింత దృష్టిపెట్టాలని ఆదేశించింది. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను తపకుండా పా టించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఏప్రిల్ 30 దాకా ఇవి వర్తిస్తాయని కేంద్రం తెలిపింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్టా టెస్ట్, ట్రాక్, ట్రీట్‌పై తప్పనిసరిగా దృష్టిపెట్టాలని మరోమారు సూచించిన కేంద్రం.. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది.

కరోనా టెస్టులకు సంబంధించి కూడా కేంద్రం పలు సూచనలు చేసింది. ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు తక్కువగా జరుగుతున్న చోట వీటిపరీక్షలను పెంచాలని 70 శాతానికి చేరుకునేలా చర్యలు చేపట్టాలని కోరింది. జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా ఉండే ప్రాంతాలను కట్టడి ప్రాంతాలుగా ప్రకటించాలని రాష్ట్రాలను ఆదేశించింది. మాస్కులు, శానిటైజర్ వినియోగం పెరిగేలా ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించిన కేంద్రం మాస్కులు ధరించని వారిపై జరిమానాలు విధించాలని కూడా రాష్ట్రాలను ఆదేశించింది. అయితే అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని రాష్ట్రాలను కేంద్రం కోరింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News