Friday, November 15, 2024

ముంచుకొస్తున్న ముప్పు

- Advertisement -
- Advertisement -

ఇంకా పూర్తి కాని టీకాలు
కొవిడ్ టీకా తీసుకోవడంపై ప్రజల నిర్లక్షం
కరోనా వ్యాక్సిన్‌కు దూరంగా 2.60 లక్షల మంది
థర్డ్ వేవ్‌తో మళ్ళీ పుంజుకున్న వ్యాక్సినేషన్

ఈ నెలాఖరులోగా 100 శాతం కోసం కుస్తీ

Vaccination is not completed

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి : ఓ వైపు థర్డ్ వేవ్ ముంచుకొస్తున్నా ఉమ్మడి జిల్లాలో ఇంకా కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి కాలేదు. రానున్న ఒకటి రెండు నెలలో థర్డ్‌వేవ్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా విషయం తెలిసిందే. ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్ పేర్లతో కరోనా వైరస్ అనేక రూపాలను మార్చుకొని మళ్ళీ పంజా విసరడానికి సిద్దం అవుతుండటంతో ప్రజలు మళ్ళీ భయందోళనకు గురౌతున్నారు.థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి ఒక ప్రక్క జిల్లా యంత్రాంగం సన్నధం అవుతున్నప్పటికి ప్రజలే ఇంకా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఇప్పటికే మాస్క్ ధరించడం తప్పనిసరిగ్గా చేస్తూ మాస్క్ ధరించని వారికి రూ.1000 జరిమానా విధించాలని ప్రభుత్వం స్పష్టమైన అదేశాలను కూడా జారీ చేసింది.

సాముహిక వేడుకలకు దూరంగా ఉండి భౌతిక దూరం పాటించాలని, విధిగామాస్క్‌ను ధరించాలని ప్రభుత్వం అదేశించింది, రానున్న ఆరు వారాలు అత్యంత కీలకమని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ అప్రమత్తం కూడా చేశారు. ప్రజలకు కరోనా అంటే భయం లేకుండా పోయింది. ఇంకా విచ్చలవిడిగా తిరగడంతోపాటు మాస్క్‌లు ధరించకుండా రహదారులపైకి వస్తున్నారు. ఇక షాపింగ్‌మాల్స్, సినిమాథియేటర్లు, మార్కెట్లో అసలు సామాజిక దూరం అనేది పాటించడం లేదు. కరోనా వైరస్ నుంచి పూర్తి స్దాయిలో రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవడమే అసలైన ఆయుధం అని ప్రభుత్వం చెబుతున్నా ప్రజలు మాత్రం టీకాలకు దూరంగా ఉంటున్నారు.

ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 96 శాతం మొదటి డోస్ టీకాల పంపిణీ పూర్తి కాగా ఇక రెండో డోసులు పూర్తి అయిన వారి శాతం కేవలం 53 శాతం మాత్రమే. థర్డ్‌వేవ్ నుంచి రక్షణ పొందేందుకు బూస్టర్ డోస్ (మూడో డోస్) అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్న సమయంలో రెండో డోస్ పంపిణీ కేవలం 53 శాతమే పూర్తి కావడం ఆందోళన కలిగిస్తుంది. ఖమ్మం జిల్లా జనభా ప్రకారం 18 సంవత్సరాలు దాటిన వారిలో ఇంకనూ 40వేల మంది మొదటి డోస్‌ను తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా రెండో డోస్‌ను తీసుకోవాల్సిన వారు ఇంకనూ 2,20,000 మంది ఉన్నారు. జిల్లాలో 15,59, 973 మంది జనాభా ఉండగా అందులో 18 ఏళ్ళు పూర్తి అయి వ్యాక్సినేషన్ వేసుకోవడానికి అర్హత కలిగిన వారు10,60,576 మంది ఉండగా వారిలో మొదిటి డోస్ వ్యాక్సిన్‌ను 10,05,456 మంది వేసుకున్నారు. రెండో డోస్‌ను 5,50,480 మంది మాత్రమే పూర్తి చేసుకున్నారు. రెండో డోస్ వేసుకునే సమయం అసన్నమైనప్పటికీ చాలా మంది నిర్లక్షం వహిస్తున్నారు.

దాదాపు 63,568 మంది వరకు రెండో డోస్ గడువు దాటినప్పటికీ ముందుకు రావడం లేదు. వ్యాక్సినేషన్ పంపిణి జాతీయ స్థాయిలో 83 శాతం ఉండగా, రాష్ట్రంలో 90 శాతం నమోదై ఉంది. ఖమ్మం జిల్లాలో 95 శాతం వరకు పంపిణి జరిగినప్పటికి ఇంకా లక్ష్యానికి ఐదు శాతం దూరంగా ఉంది. మిగిలిన ఈ ఐదు శాతాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ టార్గెట్‌గా నిర్ణయించారు. ఖమ్మం అర్బన్, కారేపల్లి, కూసుమంచి, తల్లాడ, కామేపల్లి, మధిర, వల్లబీ, నేలకొండపల్లి, సుబ్లేడు, బోదులబండ, మంచుకొండ, వేంసూరు, ముదిగొండ పిహెచ్‌సి కేంద్రాల పరిధిలో వ్యాక్సిన్ పంపిణీ కొంత వెనుకబడింది. జిల్లాలో కేవలం దెందూకూరు పిహెచ్‌సి పరిధిలోనే మాత్రమే 101 శాతం వ్యాక్సిన్ పంపిణి పూర్తి అయ్యింది. జిల్లాలో 1,93,420 డోసుల వ్యాక్సిన్లు నిల్వ ఉన్నాయి. అంతేగాకుండా 1,80,000 సిరంజీలు కూడా నిల్వ ఉన్నాయి. దీం తో ఈ నెల 7 నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను మరింత వేగం చేయాలని కలెక్టర్ అదేశాలు జారీ చేశారు. ప్రతి రోజు కనీసం 15 వేలకు తగ్గకుండా వ్యాక్సిన్ వేయాలని టార్గెట్ ఇచ్చారు. మున్సిపాల్టీ పరిధిలో 5000 వరకు టీకాల పంపిణీ జరగాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెలాఖరులోగా జిల్లాలో నూరుశాతం వ్యాక్సిన్ పంపిణీ చేసిన జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అదేశాలు జారీ చేశారు.
వ్యాక్సిన్ పంపిణీల తనిఖీ : కొవిడ్‌వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం చేసే పనిలో భాగంగా జిల్లా కలెక్టర్ పివి.గౌతమ్ సోమవారం రాత్రి తిరుమలాయపాలెం మండలంలో పర్యటించి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. మండలంలో సుబ్లేడ్, దమ్మాయిగూడెం గ్రామాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ మాలతీతో కలిసి ఆయన పర్యటించారు. ఇప్పటి వరకు మొదటి డోస్ తీసుకోకుండా ఉన్నవారితోపాటు, రెండో డోసు తీసుకోవాల్సిన వారిని గుర్తించి వారందరికి టీకా వేసేందుకు వీలుగా శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News