Friday, November 15, 2024

వ్యాక్సినేషన్ నమోదులో తప్పిదాలతో తిప్పలు

- Advertisement -
- Advertisement -

ఇబ్బందిపడుతున్న నగరవాసులు
తలలు పట్టుకుంటున్న సిబ్బంది
వ్యాక్సిన్ తీసుకోకున్న నమోదు
అధికారులే పరిష్కరించాలని విజ్ఞప్తులు

People queue for second dose of Covid vaccine

మన తెలంగాణ /సిటీబ్యూరో: వ్యాక్సినేషన్ కోసం వచ్చేవారిలో కొందరు ఫస్ట్ డోస్ తీసుకోక ముందే తీసుకున్నట్లుగా వివరాలు నమోదు కావడంతో వారు లబోదిబోమంటున్నారు. మరోవైపు ఫస్ట్ డోస్ తీసుకున్నవారు రెండవ డోస్ తీసుకోకుండానే తీసుకున్నట్లు వివరాలు పొందుపర్చి ఉండడంతో తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. మరికొందరూ ఫస్ట్ డోస్ తీసుకున్నా వివరాలు నమోదు కాకపోవడంతో సెకండ్ డోస్ తీసుకునేందుకు నానా తం టాలు పడుతున్నారు. ఈ మూడు సమస్యలు నగరవాసులకు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇదేక్రమంలో బాధితులు తాము ఎక్కడా వ్యాక్సిన్ తీసుకోలేదని తమకు వేయాల్సిందేనని పట్టుబడుతుండడం, సిబ్బంది తాము ఇచ్చేదే లేదంటూ తెగేసి చెబుతుండడంతో దీంతో వ్యాక్సినేషన్ సిబ్బంది బాధితుల మధ్యగొడవలకు కారణమవుతున్నాయి. నమోదు ప్రక్రియలో చోటు చేసుకున్న తప్పిదాల కారణంగా వ్యాక్సిన్ తీసుకున్నారో, లేదో స్పష్టం లేకపోవడంతో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. బాధితుల బాధ చూడలేక వ్యాక్సినేషన్ ఇవ్వాలకున్నా ఎక్కడ కొత్త సమస్యలు వచ్చిపడుతాయోనంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు సమస్యలను పరిష్కరించాలి
వ్యాక్సినేషన్ నమోదు ప్రక్రియలో చోటు చేసుకున్న తప్పిదాలను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించే విధంగా వ్యాక్సినేషన్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని విజప్తి చేస్తున్నారు.
తమ ప్రమేయం లేకుండనే తాము వ్యాక్సిన్ తీసుకునన్నట్లు వివరాలు నమోదు కావడం దీనిని తాము సిబ్బందికి చెప్పినప్పటీకీ తమ సమస్యను పరిష్కరించకుండా కొంత మంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సినేషన్ అనేది ఆరోగ్యానికి సంబంధించిన సమస్య అని, కావాలని ఎవరూ అదనంగా తీసుకుని ప్రాణాల మీదికి తెచ్చుకోరని, దీనిని కూ డా దృష్టిలో పెట్టుకోకుండా సిబ్బంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నరంటూ పలువురు వాపోతున్నారు. దీ నిపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News