- Advertisement -
న్యూఢిల్లీ : ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో బూస్టర్ డోసుపై చర్చ జరుగుతోంది. ముందు జాగ్రత్త (ప్రికాషన్) డోసుగా కేంద్రం పేర్కొంటున్న మూడో డోసులో ఎలాంటి మిక్స్ అండ్ మ్యాచ్ వ్యాక్సిన్లు ఉండవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సీనియర్ వర్గాలు తెలిపాయి. కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ టీకా మొదటి, రెండో డోసు తీసుకున్న వ్యక్తులకు మూడో డోసుగా వాటినే ఇస్తారని పేర్కొన్నాయి. అయితే రెండో, మూడో డోసు మధ్య 912 నెలల విరామం కీలక అంశమని వెల్లడించారు.
- Advertisement -