కరోనా స్వైరవిహారం కారణాలపై శాస్త్రవేత్తల విశ్లేషణ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా స్వైర విహారానికి స్పష్టమైన సమాధానాలు లేకున్నప్పటికీ కరోనా కొత్తరకాలు, వ్యాక్సిన్‌డ్రైవ్‌లో మాంద్యం, నిబంధ నలు పాటించడంలో నిర్లక్షం ముఖ్యంగా ఎన్నికలు, ఇతర బహిరంగ కార్యక్రమాల్లో కరోనా నుంచి తగిన జాగ్రత్తలు అంతగా లేకపోవడం తో భారీగా కరోనా వ్యాపించే అవకాశం ఉంటోందని శాస్త్రవేత్తలు అభిప్రా యపడుతున్నారు. కరోనా మొదటి వేవ్ తరువాత కొవిడ్ 19 నిబంధన లు పాటించకపోవడం, వ్యాక్సిన్ పొందినా నిబంధనలు కొనసాగించా లని ప్రజలకు తెలియచేయకపోవడం, వ్యాక్సిన్ డ్రైవ్ మందకొడిగా సా గుతుండడం కూడా ప్రధాన కారణంగా వైరాలజిస్టులు షాహిద్ జమీల్, టి జాకబ్ జాన్ అంగీకరించారు. ంద్ర ప్రభుత్వంతోపాటు రాజకీయ పార్టీల నేతలు మతపరమైన సమాజాలు, ప్రజాసమూహాలు నిర్లక్షం వహిస్తున్నాయని, సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయకుండా స్కూళ్లు, కాలేజీ లు తెరుస్తున్నారని తమిళనాడు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వైరాలజీ ప్రొఫెసర్ జాన్ వ్యాఖ్యానించారు.
కరోనా కొత్త రకాల విషయంలో భార త్ చాలా ఆలస్యం చేసిందన్నారు. మార్చి 24న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమీక్షను ప్రస్తావిస్తూ ప్రస్తుతం పంజాబ్ లోని కరోనా కేసుల్లో 80 శాతం బ్రిటన్ వేరియంట్లేనని ఉదహరించారు. కొత్తగా డబుల్ మ్యూటెం ట్ కరోనా భారత్‌లో చెలరేగుతోందని, మహారాష్ట్ర కేసుల్లో 15 నుంచి 20 శాతం డబుల్ మ్యూటెంట్ లేనని తెలిపారు. ఈశాతం ఇంకా పెరిగితే మహారాష్ట్రలో కరోనా విజృంభణకు వీటి పాత్రే కీలకమౌతుందని తెలిపా రు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సిడిసి) మార్చిలో మహా రాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, నుంచి సేకరించిన లాలాజల నమూనాల్లో కొత్త వేరియంట్ గుర్తించినట్టు వెల్లడించిందన్నారు. రెండు ముఖ్యమైన వేరి యంట్లు డబుల్ మ్యూటెంట్‌గా పేర్కొంటున్నారు. బ్రిటన్ వేరియంట్ 50 శాతం మించి వ్యాప్తి చెందగా, డబుల్ మ్యూటెంట్‌లో ఒకటి కాలిఫో ర్నియా, అమెరికాలో కూడా తీవ్ర వ్యాప్తికి కారణమైందని జమీల్ వివరిం చారు. భారత్‌లో జనవరి మూడో వారంలో వ్యాక్సిన్ చాలా నెమ్మదిగా ప్రారంభమైందని, అదీనూ హెల్త్ కేర్ వర్కర్లకే మొదటి ప్రాధాన్యం ఇచ్చా రని వారితో పాటు వ్యాక్సిన్ కావలసిన వారికి ఆలస్యం చేశారని జాన్ చెప్పారు.
నెలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ 10 మిలియన్ డోసులు, కొవాగ్జిన్ మూడు మిలియన్ డోసులు ఇచ్చే సామర్థం భారత్‌కు ఉన్నా వ్యాక్సిన్ సరఫరా సమస్యగా మారిందని వ్యాఖ్యానించారు.జాన్సన్ అండ్ జాన్సన్, రష్యా స్పుత్నిక్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వడం ద్వారా సరఫరాను మరింత పెంపొందించ వచ్చని సూచించారు. ఈ తాజా అధ్యయనంలో ఐఐటి కాన్పూర్‌కు చెందిన శాస్త్రవేత్తలతోపాటు శా స్త్రవేత్తలంతా ఈ సెకండ్ వేవ్ ఏప్రిల్ మధ్యకాలంలో తారాస్థాయికి చేరుకుంటుందని, మే నెలాఖరుకు తగ్గుతుందని అంచనా వేశారు.