Saturday, November 23, 2024

ఒక్కో డోసు రూ.250

- Advertisement -
- Advertisement -

Vaccine Each dose is Rs.250

 

వ్యాక్సిన్ ఖరీదు రూ. 150, సర్వీస్ చార్జి వంద రూపాయలు
ప్రైవేటు ఆసత్రుల్లో కరోనా టీకా ధరను ఖరారు చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: మార్చి 1వ తేదీనుంచి దేశంలోని 60 ఏళ్లు, అంతకు పైబడిన వయసు వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్‌ను అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ టీకాను ప్రైవేటు ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకాను ఉచితంగా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా వేయించుకునే వారు మాత్రం కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ వ్యాక్సిన్ ధర డోసుకు రూ.250గా ఉgటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. ఈ మొత్తంలో రూ.150 వ్యాక్సిన్ ఖరీదు కాగా, వంద రూపాయలు సర్వీస్ చార్జి. ఈ వంద రూపాయలను వ్యాక్సిన్ ఇచ్చే ఆసుపత్రికి చెల్లించాల్సి ఉంటుంది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇదే ధర ఉంటుందని కూడా ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ విషయం తెలియజేసినట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పటికయితే దేశవ్యాప్తగా ఒకే ధర ఉంటుందని, భవిష్యత్తులో ధర పెంచే అవకాశమున్నట్లు సమాచారం. కాగా లబ్ధిదారులు కొవిన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం లేదా ఆరోగ్య సేతు లాంటి ఇతర ఐటి అప్లికేషన్ల ద్వారా ముందుగానే తమ పేరును తామే నమోదు చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. తమకు అనువైన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని (సివిసి)లబ్ధిదారులు ఎంపిక చేసుకొని వ్యాక్సినేషన్‌కు అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోవచ్చని కూడా ఆ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News