Saturday, December 21, 2024

ఇక క్యాన్సర్‌కు టీకా రానుంది

- Advertisement -
- Advertisement -

సియాటెల్ : ప్రాణాంతకపు క్యాన్సర్ చికిత్స ప్రక్రియలో భాగంగా ఇకపై వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రానుంది. క్యాన్సర్ చికిత్స ప్రక్రియ సంక్లిష్టం అయిన దశలో టీకాలతో దీనిని నివారించడానికి కాకపోయినా, అదుపులో పెట్టడానికి వీలేర్పడుతుందని పరిశోధకులు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే వీటితో వెనువెంటనే క్యాన్సర్ నివారణ జరగదు. అయితే ట్యూమర్లు హరించుకుపోయేందుకు , నయమైన క్యాన్సర్ తిరిగి రాకుండా ఉండేందుకు ఈ వ్యాక్సిన్లతో వీలేర్పడుతుంది.

Also Read: ఒడిషాలో పెళ్లి బృందం మృత్యువాత

వ్యాక్సిన్లతో వక్షోజ, ఊపరితిత్తుల క్యాన్సర్లకు చికిత్స కోసం ఇప్పుడు ప్రయోగాలు సాగుతున్నాయి. ఇప్పటికే పేగులు, మెలనోమా క్యాన్సర్ల చికిత్సకు ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ల వాడకుం సత్ఫలితాలను ఇచ్చింది. అయితే ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్లతో క్యాన్సర్ నయం అవుతుందని చెప్పలేమని , మరింతగా ప్రయోగాలు జరిగితే ఈ దిశలో విజయం సాధించేందుకు వీలేర్పడుతుందని అమెరికాలోని నేషనల్ క్యాన్సర్ సంస్థ సారధి అయిన డాక్టర్ జేమ్స్ గుల్లే తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News