Friday, November 22, 2024

చికున్‌ గున్యాకు సమర్థవంతమైన సింగిల్ డోస్ వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చికున్ గున్యా నివారణకు సురక్షితం, సమర్ధవంతమైన సింగిల్ డోస్ వ్యాక్సిన్ తయారైంది. ఈ వ్యాక్సిన్ మొదటి దశ మూడో ట్రయల్స్‌లో వైరల్ వ్యాధిని గట్టిగా ప్రతిఘటించే శక్తిని ఉత్పత్తి చేస్తోందని అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం ది లాన్సెట్ జర్నల్‌లో వెలువడింది. ఫ్రెంచి బయోటెక్ కంపెనీ వాల్నేవా ఈ వ్యాక్సిన్ ( విఎవఎ 1553) ను తయారు చేసింది. ఇంతవరకు చికున్‌గున్యాకు అంగీకార యోగ్యమైన వ్యాక్సిన్లు లేవు. అలాగే సమర్ధవంతమైన, సురక్షితమైన చికిత్సలు లేవు. ఈ వైరల్ స్థానికంగా వ్యాపించే ప్రాంతాల్లోని వారికి ఈ వ్యాక్సిన్ ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది.

చికున్‌గున్యా బాగా విస్తరించే ప్రాంతాల్లోకి వెళ్లే వారికి , ప్రయాణికులకు ఇది ఎంతో రక్షణ కలిగిస్తుందని వాల్నేవా సంస్థ క్లినికల్ స్ట్రాటజీ మేనేజర్ మార్టినా స్కెనెయిడెర్ వెల్లడించారు. వ్యాక్సినేషన్ తరువాత యాంటీబాడీ స్థాయిలు భారీగా పెరిగాయని ఫలితాలు నిరూపించాయని తెలిపారు. ఈ వ్యాధి వయోవృద్ధులకు ఎక్కువ రిస్కు. అందువల్ల వయోవృద్ధుల్లోనూ ఇమ్యునిటీ స్థాయిలు బలంగా పెరిగాయని ప్రయోగాల్లో తేలిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News