Friday, November 15, 2024

టీకా కీలక నిత్యావసర ఆరోగ్య సరుకు

- Advertisement -
- Advertisement -

వృధా నివారణతోనే వ్యాక్సినేషన్ బలోపేతం
రాష్ట్రాలు యుటిలకు కేంద్రం సూచనలు
పర్యవేక్షణకు కీలక వ్యవస్థ

Biological E's Corbevax may be India’s cheapest COVID-19 vaccine

న్యూఢిల్లీ: కొవిడ్ టీకాలు వృధా కాకుండా ఉంటే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ బలోపేతం అవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. కొవిడ్ నియంత్రణకు ఇప్పుడు వ్యాక్సిన్లు అత్యవసరం. ఈ దిశలో టీకా ఇప్పుడు నిత్యావసర ప్రజా ఆరోగ్య సరుకు అయింది. ఈ కీలకమైన సరుకుకు ప్రపంచ వ్యాప్త కొరత ఉంది. డిమాండ్‌కు తగ్గ సరఫరా అందుకోవడానికి అన్ని దేశాలూ యత్నిస్తున్నాయి. ఈ దశలో ఏ ఒక్క టీకా డోసు వృధా అయినా అది వ్యాక్సినేషన్ ప్రక్రియకు తూట్లు పొడిచినట్లే అవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. వ్యాక్సినేషన్ల కార్యక్రమంతో సంబంధం ఉన్న ప్రతి భాగస్వామ్యపక్షం టీకాల పట్ల తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుంది.

ప్రత్యేకించి పౌరులు తమ చుట్టూ ఉన్న పరిస్థితులు, తమ కడగండ్ల కొనసాగింపు క్లిష్ట దశను గుర్తించి వ్యాక్సిన్ల వృధా నివారణకు తమ బాధ్యత వహించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. సాధ్యమైనంత వరకూ వ్యాక్సిన్ వృధాను పూర్తిగా తగ్గించుకుని తీరాలి. దీని వల్ల అత్యధికంగా ప్రజలకు టీకాలు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ల వృధా 1 శాతం కన్నా తక్కువగా ఉండటంలో తప్పేమీలేదని ఇప్పటికీ తాము చెపుతూనే ఉన్నామని, అయితే స్థాయిని మించి టీకాల వృధా జరిగితే అది వ్యాక్సినేషన్ల బలోపేతానికి విఘాతంగా మారుతుందని కేంద్రం స్పష్టం చేసింది.

పలు రాష్ట్రాలు భారీస్థాయిలో వ్యాక్సినేషన్లకు దిగుతున్నాయి. ఈ క్రమంలో వృధాకు అవకాశం ఇవ్వడం లేదు. అయితే కొన్ని సందర్భాలలో టీకాల వయాల్స్ నుంచి ఎక్కువ డోస్‌లు రూపొందించే క్రమంలో కొంత ప్రతికూలత ఏర్పడుతోంది. ఈ స్థాయిలో జరిగే 1 శాతం లేదా అంతకు తక్కువ స్థాయి వృధా అవాంఛనీయం ఏమీ కాదని, ఇందులో తప్పేమీ లేదు. సముచితమే అని కేంద్రం తెలిపింది. వ్యాక్సిన్ల తయారీ అత్యంత సంక్లిష్ట ప్రక్రియ. దీనిని రూపొందించే క్రమంలోనే దీనికి సంబంధించి ఏర్పడే డిమాండ్‌తో పోలిస్తే సరఫరా కోటా తక్కువ అవుతోంది. ఈ విషయాన్ని గుర్తించాల్సి ఉంది. ఇప్పుడు అత్యంత విలువైన నిత్యావసర సరుకుగా మారిన టీకాలను జాగ్రత్తగా కాపాడుకోవల్సి ఉంది. వృధా అనేది ఎక్కడైనా ఉండనే ఉంటుంది. అయితే ఈ టీకాల విషయంలో దీనిని సాధ్యమైనంత తగ్గించుకోవల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News