Saturday, December 28, 2024

వడగళ్ల బీభత్సం..గాల్లో తేలిన ఇంటి పైకప్పు

- Advertisement -
- Advertisement -

కాసిపేటః తీవ్రమైన ఎండకు ప్రజలు బేజారెత్తిపోయి నీడలో సేద తీరుతున్న సమయంలో ఆదివారం మద్యాహ్నాం ఒక్క సారిగా వడగాలులు వీచి వర్షం కురవడంతో పల్లంగూడ గ్రామంలో కొత్త శంకర్ శకుంతలకు చెందిన ఇంటి పై కప్పు రేకులు ఎగిరి అల్లంత దూరాన పడడంతో రేకులు మొత్తం పగిలి పోయాయి. ఇటివలనే ఇంటికి రేకులు వేసుకున్నట్లు వారు తెలిపారు. ఒక్క సారిగా గాలి వీయడంతో ఇంటి పైకప్పు మొత్తం ఎగిరి పోయి క్రింద పడడంతో రేకులు మొత్తం ద్వంసం అయ్యాయిని వారు వాపోయారు.

పేద వారమైన తాము అతి కష్టం మీద రేకులు కొనుగోలు చేసి ఇంటిపై కప్పుగా వేసుకొవడం జరిగిందని వారు అన్నారు, గాలికి ఇంటి కప్పులు కొట్టుకు పోయి తమకు నిలువ నీడ లేకుండా చేసిందని వారు వాపోయారు. సూమారు 50 వేల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు వారు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు బోరున విలపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News