Thursday, January 23, 2025

ఘనంగా వద్దిరాజు నారాయణ వర్ధంతి వేడుకలు

- Advertisement -
- Advertisement -

Vaddiraju Narayana Vardhanthi Celebrations

మనతెలంగాణ/కేసముద్రం రూరల్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామానికి చెందిన వద్దిరాజు నారాయణ 15వ వర్ధంతి వేడుకలు మంగళవారం జరిగాయి. స్వగ్రామంలోని వద్దిరాజు గార్డెన్స్‌లోని తల్లిదండ్రుల సమాధి వద్ద టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి), తన సోదరులు, కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు. అంతకుమందు స్వగృహంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి బ్రాహ్మణుల ఆశీర్వాదం పొందారు. తమ తల్లిదండ్రుల వర్ధంతి వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుకుంటామన్నారు. అదేరీతిలో ఈ సంవత్సరం కూడా జరుపుకున్నామని వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో వద్దిరాజు సోదరులు కిషన్, దేవేందర్, చిన్న వెంకన్న, మోహన్, పెద్ద వెంకన్న, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News