Monday, December 23, 2024

రాజకీయాలతో సంబంధంలేని 38 మంది గెలిచారు: వద్దిరాజు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: జనం నాడి మనం తెలుసుకోలేకపోయామని ఎంపి వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. తెలంగాణ వద్దిరాజు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాజకీయాలతో సంబంధం లేని 38 మంది గెలిచారని, తెలంగాణ సమస్యలపై పార్లమెంటులో పోరాడే ఏకైక వ్యక్తి నామా అని ప్రశంసించారు. నామా నాగేశ్వరరావుకు మళ్లీ ఖమ్మం ఎంపి సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఏమీ చేయలేదనే నిర్ణయానికి ప్రజలు వచ్చారన్నారు. అమలు కాని 420 హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని మండిపడ్డారు. వంద రోజుల్లో 13 హామీలు చేయాల్సి ఉందని, ఎన్నికల వరకు కాలయాపన చేస్తున్నారని వద్దిరాజు ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News