Saturday, December 21, 2024

కెసిఆర్ సభకు నడిచిన ఎంపి వద్దిరాజు, ఎమ్మెల్సీ పోచారం

- Advertisement -
- Advertisement -

 

నల్లగొండ: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా చండూరులో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటు చేసిన బహిరంగసభలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవడంతో వారిద్దరు గులాబీ శ్రేణులతో కలిసి సుమారు 2 కిలోమీటర్లు కాలినడకన సభాస్థలికి చేరుకున్నారు. పలువురు కార్యకర్తలు ఎంపి రవిచంద్ర, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిలతో ఫోటోలు దిగారు. జై తెలంగాణ జై జై తెలంగాణ, జిందాబాద్ జిందాబాద్ కెసిఆర్ జిందాబాద్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News