Wednesday, April 30, 2025

వైరలవుతున్న వైభవ్ చిన్ననాటి ఫోటో.. అప్పుడు ఏ టీంకి సపోర్ట్ అంటే..

- Advertisement -
- Advertisement -

వైభవ్ సూర్యవంశీ.. ఒక మ్యాచ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేశాడు ఈ 14 ఏళ్ల కుర్రాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత శతకం సాధించిన వైభవ్.. ఎన్నో రికార్డులను సాధించాడు. అంతేకాక.. క్రికెట్ దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

ఈ నేపథ్యంలో వైభవ్‌కి సంబంధించిన ఒకొక్క విషయాలు బయటకు వస్తున్నాయి. అతను ఈ వయస్సులోనే ఇంతటి ఘనత సాధించేందుకు అతని తల్లిదండ్రులు చేసిన కృషి.. లాక్‌డౌన్ సమయంలో అతను ప్రాక్టీస్ చేస్తున్న వీడియో.. ఇలా ఎన్నో విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా వైభవ్‌కి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

చిన్ననాటి నుంచి క్రికెట్ అంటే ఇష్టపడే వైభవ్.. ఆరేళ్ల వయస్సులో స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అప్పుడు అతను ఐపిఎల్ టీంలలో ఒకటైన రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు. ఈ ఫోటోని లక్నో టీం ఓనర్ సంజీవ్ గోయెంకా ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు ఫోటో తెగ షేర్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News